Jump to content

పుట:Prabhutvamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వమనగా నేమి?

3

లకో కర్చగుచుండుట నిజమేకాని ఇంతకు కొంచెము పూర్వము అది గ్రామములమొత్తము మేలునకు వినియోగపడుచుండె ననుట నిక్కువము. 40 ఏండ్లకు పై బడనికాలమున సమష్టిమీద గ్రామమునకు కావలసిన బావులు మొదలై నజలాధారములు బాగుచేయుటయు, ఉపాధ్యాయులను నియమించుటయు, బాటలు చక్కబెట్టుటయు, మున్నగుకార్యములు గ్రామస్థులే జరుపుకొనుట కన్నులార చూచినవారు చాలమందికలరు. ఇక వివాదముల తీర్పు విషయమై వ్రాయనక్కరయేలేదు. గ్రామ సీమలలో నివసించువారి కందరికిని అంతయునశించిన నేటి కాలమునందును 'పంచాయతు' లను శబ్దము కడుంగడు పరిచితముగా నున్నది. ఎంతటి నిమ్నజాతులలోను వివాదములను తీర్చికొనుశక్తి మనదేశమున పరంపరాగతముగ వచ్చియున్నదనుట మన ప్రజ కంతటికిని తెల్లముగా తెలిసిన సంగతియే. కొంతకాలముక్రిందట మద్రాసునగరమునందు తోటిపాకీవారలందరును సంఘముగా నేర్పడుట సంభవించినది. అందులో కొంద రొకయేర్పాటు చేసికొనిరి. తమలో తమకు కలుగు వివాదములను బయటికి తీసికొని పోవరాదనుకొనినారు. పంచాయతిని నియమించికొనినారు. తీర్పులు చెప్పికొన్నారు. ఆతీర్పులమూలకముగను సంఘమునకు కొద్దిగా ద్రవ్యము చేరినది.

ఇక ప్రాచీనగ్రామసంస్థల ఏర్పాటు లాలోచింతమా మనదేశములోనుండినంత యౌత్కృష్ట్యము మరి యేదేశములోను నుండినదికాదు. దానినంతయు నిట వివరించుటకురాదు. అది స్థానిక స్వపరిపాలనమను గ్రంథ