పుట:Prabhutvamu.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

53

వీనికి 'సెంట్రలైజ్డు రిపబ్లిక్కు' లందురు. దక్షిణఅమెరికాలోని “ పెరూరాష్ట్ర మిట్టిది. మధ్యఅమెరికాలోని 'నికరాగుఆ'యు నిట్టిదియే. దక్షిణ అమెరికాలోని 'పెరూగ్వే'యు నింతియే. నేటిదినము శాసనము లనంతములు, కార్యజాలము బహుళతమము. అందుచేత ఆయుత్తమాధికారి నంటికొని రమారమి ఆతనితో సమానముగా జవాబుదారీలను పంచుకొనునట్టి యధికారులు కార్యనిర్వాహకులు కొంద రేర్పడియున్నారు. వీరే మంత్రివర్గము. పూర్వపురాజు, ఆతనిమంత్రులు - నేటి యుత్తమాధికారి, అతని మంత్రివర్గము, (లేదా, ఆతని కార్య నిర్వాహకవర్గమునకు) సరిపోవుచున్నారు. తరువాత రాష్ట్రములోని పరిపాలనశాఖల యుత్తమాధికారులును వారిచేతిక్రింద పనిచేయునట్టి యధికారి పరంపరయు శాసననిర్వహణాధికారధూర్వహు లగుచున్నారు. మనదేశపు పరిభాషలో జెప్పదలచితి మేని గవర్నరుజనరలు మొదలుకొని పోలీసుకనిస్టేబిలు, నీరుగట్టు తలారులవరకును శాసననిర్వహణాధికారులు.

శాసననిర్వహణాధికారమును వీరు బహువిధముల ప్రచారమునకు దెచ్చుచున్నారు. ఎల్ల రాజకార్యములకు, ఇతరకార్యములకు వలెనే, ద్రవ్యము మూలాధారము. రాజ్యమునకు ఈద్రవ్య మనునట్టిది పన్నుల మూలకమున సమకూరుచున్నది. శాసనకర్తలు పన్నులు ఏయేరీతుల విధింపవలసినది మున్నగు సూత్రములను చేయుచున్నారు. అధికారవర్గమువారు ఎంతెంతమొత్త మెవ్వరెవ్వరివద్ద నుండి రాబట్టవలసినదియు నిర్ణయించి, వసూలు చేయు