పుట:Prabhutvamu.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ప్రభుత్వము

ములలో శాసననిర్వహణాధికారము నేరుగా శాసననిర్మాణాధికారులకే సంక్రమించుచుండుటచేత శాసనవివరణమునకు ముందుగా శాసననిర్వహణమును గురించి యాలోచించుటే యవసరమగు చున్నది.

ప్రాచీనకాలములయం దేమి, నిన్న నేటివర కేమి శాసననిర్వహణాధికారము సామాన్యముగా రాజులకును, వా రేర్పరచుకొనిన సహాయకులకును, వారు నియమించిన యధికారులకును చెందుచు వచ్చినది. అనేకరాష్ట్రములలో- రాజు నిరంకుశుడుగానుండినట్లు కానవచ్చు రాష్ట్రములలో సయితము — స్థానికవిషయములయందు ఆయాప్రాంతములప్రజలు తమకార్యములను తామే నిర్వహించు కొనుచు వచ్చినది నిజమే. కాని మొత్తముగా రాజ్యమునకు సంబంధించిన కార్యనిర్వహణమునందు రాజును, ఆతనిచే నియమితులైనవారును మాత్రమే ప్రవర్తించుచు వచ్చిరనుట సత్యము.

ఉత్తమాధికారి

ఎప్పుడును కార్యనిర్వహణమునకు పదుగురయధికారము పనికిరాదు. కాబట్టి నేటిదినమును ఎల్ల రాష్ట్రములలోను శాసననిర్వహణము ప్రప్రధమముగా నొక్క యుత్తమాధికారియందు నిక్షిప్తమయి యున్నది. పూర్ణ ప్రజాసత్తాకములలో కొన్నిటియందు వోటర్లందరునుచేరి ఉత్తమాధికారి నెన్నుకొని అతనికి అధికారకాలపరిమితి యున్నంతవరకు నాలుగేండ్లో, ఎక్కువయో నిరంకుశాధికార మిచ్చి వేయుటగలదు. అట్టి ప్రజాసత్తాకములను 'కేంద్రీకృతప్రజాసత్తాకము' లన్నారు. ఇంగ్లీషులో