పుట:Prabhutvamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ప్రభుత్వము

గుట కనుకూల మేర్పడినది. ఏలయన నచ్చట సభవారు మూడు పర్యాయములును సమ్మతులు తెలిపి ఒకవిధమగు తీర్మానమునకు నచ్చినట్లుగా సూచింపవలసి యున్నారు.

(2) శాసనమును ఉపసంఘముల యాలోచనకు బంపుట రెండవముఖ్యమగుసూత్రము. దేశ శాసనసభలలో నూర్లకొలది సభ్యు లుందురు. అందరికిని అన్నివిషయములును తెలిసి యుండవు. వాస్తుశాస్త్రముతో నెక్కున సంబంధముగల శాసనము ఉపక్రమితమైనయెడల వైద్యశాస్త్రజ్ఞుడు దాని విషయమయి స్థూలదృష్టిని విమర్శ చేయగలడేమోగాని సూక్ష్మాంశములలోనికి దిగి యిదమిద్ధమని తేల్చుటకు మాత్రము వలంతిగాడు. దేశ మంతటికిని శాసనములు చేయుపట్టున నిట్టిసమయములు దినదినమును పొడసూపుచుండును. సూక్ష్మాంశములచర్చ నూర్లకొలది ప్రజలకు రుచించునదియుం గాదు. కాబట్టి యుపసంఘముల యాచారము వాడుకలోనికి వచ్చినది. సంగతులు తెలిసిన యొకకొందరు సావకాశముగా కూర్చొని యొక్కొక్క విషయమును విమర్శించి ఆయాశాసనమును తమసభవారికిగాని, సభలవారికిగాని నివేదించు చున్నారు. తగిన వారియాలోచన పొందినందున శాసనసభలవారు ఆశాసనమును సులభతరముగా నంగీకరించుటకో, తిరస్కరించుటకోశక్తికలవా రగుదురు. ఇప్పట్టున మనకు 1920-లో ప్రసాదితమైన సంస్కరణశాసన మెట్లు విమర్శనందినదియు జ్ఞాపకమునకు దెచ్చికొనవచ్చును. ఆశాసనమున ముఖ్యమగు మార్పులు చేసినవారు ప్రజా ప్రతినిధిసభ ప్రభుసభలలోనుండి ఏర్పడిన