Jump to content

పుట:Prabhutvamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

43

డుటగాని, ఒక్కొక్కరును ఇష్టమువచ్చినంతసేపు ఉపన్యసించుటగాని, ఇష్టమువచ్చినప్పుడు ఇష్టమువచ్చినవారులేచి సంభాషించుటగాని పొసగినచో జాతరయైపోవును. కాబట్టి ఒక్కొక దేశములోను శాసనసభలలో కార్యములు సాగించుటకు సూత్రము లనేకము లేర్పడియున్నవి. ఈ సూత్రము లన్నిటిని ఇట వివరించుటకుగాని, విమర్శించుటకు గాని తావుచాలదు. కాని, మూడు ముఖ్యసూత్రములు ఎల్లదేశములలోను ప్రముఖముగా నంగీకృతమయి యుండుటనుజేసి వానిని బేర్కొనదగియున్నది.

(1) ఏశాసనమైనను మూడుపర్యాయములు చదువనిది ఏసభలోను తీర్మానముకారాదు. ఇది అత్యావశ్యకమైన సూత్రము, మనదేశములోను ముమ్మాటికి చెప్పెదను విను మను నభ్యాసముకలదు. ఏదోవిషయము విమర్శకు తేబడినప్పుడు ఒకానొక సభ్యుడు పరధ్యానముగా నుండవచ్చును. అలసట చెంది యుండవచ్చును. లేదాభ్రాంతి పడియుండవచ్చును. ఊరక తలయూప వచ్చును. అయిన నదేవిషయము మూడుపర్యాయములు చదువంబడునేని సామాన్యముగా భ్రమప్రమాదములకు నవకాశముండదు. ఈసూత్రమున కిదియేయర్థము. ఇందింతటి యర్థము నిండియున్నను సామాన్యముగా శాసనములు మొదటి కడపటి పర్యాయములు మంత్రములవలె చదువ బడుచున్నవి. రెండవపర్యాయము చదువబడునప్పుడు మాత్రము సభ్యు'లు మేల్కొని ఉత్సాహముతో, అభినివేశముతో విమర్శకు గడంగు చున్నారు. . ఆంగ్లభూమివంటి భూములలో మాత్రము మూడు పర్యాయములును తగినంత చర్చజరు