పుట:Prabhutvamu.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

45

యుపసంఘమువారు. వారే యేమార్పులు సూచించిరో రమారమిగా నన్నిటిని బ్రిటిషురాజ్యాంగ సభలవా రామోదించిరి. వారిసలహాలకు వ్యతిరేకముగా కొనిరాబడిన సవరణలన్నియును త్రోసివేయబడియెను. ఉపసంఘముల యాచారము ఎంత బలవంతమైనదియు ఈయొక్క నిదర్శనము వలననే స్పష్టమగుచున్నది. ఉపసంఘముల ప్రభావ మింకను నొక కొంతవర్ణింపదగి యున్నది. ఉదాహరణార్థము అమెరికాసంయుక్త రాష్ట్రముల శిష్టసభనే కైకొందము. ఆసభలో విమర్శింపదగిన శాసనములు సంవత్సరము సంవత్సరమును వేనవేలుండును. అందుచేత ఏబది యువసంఘము లేర్పడియున్నవి.సభయందు సామాన్యముగా మొదట చదువుటలో శాసనము పేరు, ఉద్దేశము చదువబడు చున్నది. వెంటనే దానిని తత్సంబంధియగు నుపసంఘమువారి యాలోచనకు బంపివేయుచున్నారు. ఉపసంఘమువారు అందులో కావలసినన్ని మార్పులు చేయుట కధికారము కలవారై యున్నారు. వారు దాని స్వరూపమునే వేరుచేసి దానిని క్రొత్త శాసనమునే కావింపవచ్చును. తుదకు దానిని సభవారి విమర్శకు తేక యుండవచ్చును. అనగా శాసనము ఉపసభవారి యధీనమున బడినది యనిన దాని యునికి, నాశనము వారి చేతులలోనే యున్నవనుట స్పష్టము.

(3) విమర్శలను నిలుపుదలచేయుట కేర్పడిన సూత్రము మూడవ ముఖ్యసూత్రము. ఏసభలోనైనను ఎక్కువ సంఖ్యాకులు 'ఇక విమర్శ' చాలునని కోరుటకు అధికారము కలవారై యున్నారు. ఇది యంత మంచి