పుట:Prabhutvamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ప్రభుత్వము

క్క సందర్భమును ఆటంకపరచుటకు నధికారము కలవారగుదురేని పని నిలిచి యరాచకము ప్రారంభము కావలసివచ్చును. అందుచేత ద్రవ్యసంబంధ మగు శాసనములపై శిష్టసభలకు అనేక నాగరకరాష్ట్రములలో నెక్కువ యధికారము పెట్టబడలేదు. ద్రవ్యమునకు సంబంధించిన శాసనమును ఆంగ్లభూమిలోని ప్రభువులసభవారు త్రోసివేయరు అనున్యాయము 1910 వ సంవత్సరమువరకును ప్రబలుచువచ్చినది. త్రోసివేయరాదను నిర్బంధము మాత్రముండలేదు. ఆసంవత్సరమున ప్రజాప్రతినిధిసభనుండి యొక ద్రవ్యసంబంధి యగుశాసనము పోగా దానిని ప్రభువులు పట్టుబట్టి త్రోసివేసిరి. అందువలన ప్రజలలో నుద్రేకము కలిగి ప్రభుసభకు నట్టియధికారమే లేదను నిర్ధారణ యేర్పడిపోయెను. అంతేకాదు. ఏశాసనమువిషయములోను ప్రభుసభకు తీర్మానాధికారములేదని యంగీకృతమయ్యెను. అమెరికాసంయుక్తరాష్ట్రములలో శిష్టసభ వారు ద్రవ్యసంబంధమగు శాసనమును నుపక్రమించుటకు రాదుగాని ప్రజాప్రతినిధి సభలో నుపక్రమితమైన శాసనమునందు సవరణలు చేయవచ్చును. ఇది మిక్కిలి గొప్పయధికారమే. సవరణలనుపేరిట క్రొత్తశాసనమునే చేసివేయవచ్చును. అమెరికాసంయుక్తరాష్ట్రముల శిష్ట సభవారు ఈకారణముచేత ద్రవ్యసంబంధమగు శాసననిర్మాణవిషయమునను ప్రజాప్రతినిధిసభవారితో సమానమైన స్వాతంత్ర్యములు కలవారయి యున్నారనియే చెప్పదగును. ప్రజాసత్తాకములందంతటను నింతమాత్రపు నిర్బంధము సామాన్యముగ కనుపించును. ఒక్క స్విట్‌జర్‌లాం