పుట:Prabhutvamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

41

డులో మాత్రము అన్నివిషయములలోను శిష్టసభకును, ప్రజాప్రతినిధిసభకును పూర్తిగా సరిసమానమైన హక్కులు గలవు. ద్రవ్యసంబంధశాసనమని ఇతరశాసనమని భేదమిచ్చట పాటించుటలేదు.

ప్రజాప్రతినిధిసభకు ద్రవ్యసంబంధ శాసనములు చేయుటలో నెక్కువ యధికారముండ తగినదను సిద్ధాంతము నిజముగా ఆంగ్లభూమిలో జన్మించినదే, జన్మించతగినదే. ఏలయందురా ! ప్రభుసభ వట్టి శిష్టసభ కాదు. పరంతరాగతప్రభువుల సభయనుట యిదివరలోనే వర్ణితమైనది. కాబట్టి ప్రజలు అట్టిసభకు నెక్కువ శక్తులను నిలువ నిత్తురనుట యెన్న రానిమాట. ఎట్లైనను ఆంగ్లభూమిలో ప్రారంభమయిన ఈ సిద్ధాంతము అనేక రాష్ట్రములలో నంగీకృతమగుటకు వేరుకారణము లుండవలెను గదా! ఆకారణము లిదివరలోనే కొంత సూచితమైనవి. అంతే కాదు. దేశాదాయము దేశప్రజలనుండి వసూలగుచున్నది. దేశప్రజలు తమ ప్రతినిధులను నేరుగా నెన్నుకొని ప్రజాప్రతినిధి సభకు ననుపుచున్నారు. ద్రవ్యమిచ్చువాడు తనకు ఎక్కువ నమ్మకము గలవానిచేత దాని వినియోగము చేయించునుగాని యొరున కంత యెక్కువగా నధికారములీయడు. ఇది మిక్కిలి సహజమైనస్థితి, కాబట్టియే ప్రజాప్రతినిధిసభలకు ద్రవ్యసంబంధవిషయక శాసనముల యెడల నెక్కువ యధికారము సమకూరినది.

బహుళ ప్రజలనిర్వచనముచే నేర్పడునదగుట చేతను, ద్రవ్యాధికారము హస్తగతముచేసికొని యుండుట చేతను ప్రజాప్రతినిధిసభయే రాజ్యాంగములలో నెల్ల