పుట:Prabhutvamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

39

సభలో చట్టములను ప్రవేశ పెట్టవచ్చును. అనగా ఫలానావిషయమునుగురించి, ఉదాహరణార్థము, నీటిసరఫరాను గురించి, ఈయీరీతిగా ఈదేశమున ఏర్పాటులు జరుగవలసినదని సంపూర్ణపద్ధతిని నియమించుచు శాసనము చేయవలసినదని ఏసభ సభ్యుడై నను ఆసభలో ఉపక్రమింపవచ్చును. ఏశాసనములో నైనను మారుపాటులు చేయవలసినదని కాని, ఏశాసనమునై నను రద్దుచేయవలసినదని కాని ఉపక్రమించుటకు రెండు సభలవారికిని అధికారము కలదు. ఒక్కసభలో తీర్మానమైన విషయమును రెండవ సభవారు ఆలోచనచేసి తమ యభిప్రాయానుసారము ఆ తీర్మానమైన విషయమును అంగీకరించుటకో,మార్చుటకో, రద్దుచేయ సలహాయిచ్చుటకో అధికారము కలవారై యుందురు.

అయిన నీకడపటి యధికారము రెండుసభలును నిరాఘాటముగా ప్రయోగించుట కవకాశ ముండినయెడల రాజ్యకార్యములు జరుగుట దుర్లభమగును. ప్రజాపరిపాలితరాష్ట్రము లన్నిటిలోను ప్రజాప్రతినిధిసభలో సభ్యులుగా నుండునట్టి వారిలో నెక్కువ పలుకుబడిగల కక్షి సభ్యులు రాజ్యకార్యనిర్వాహకులుగా నుందురు. ఎట్టి కార్యనిర్వాహకమునకును ద్రవ్యమే మూలాధారము. ఇక రాజ్యకార్యనిర్వహణమునకు దాని యవసర మింతింతని చెప్పరాదు. ప్రజాప్రతినిధిసభవారు ఇంత ద్రవ్యము కావలెను. ఇట్లు ద్రవ్యమును సేకరింపవలయును, ఈరీతిగా నీద్రవ్యమును వ్యయ పెట్టవలయును నను మున్నగు నేర్పాటులు కావించినప్పుడు శిష్టసభవారు ఇందులో నొక్కొ