పుట:Prabhutvamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

23

ప్రజలప్రతినిధిసభ యొకటి. కొంచెము మార్పుతో మరియొకసభ యొకటి. దీనిని అప్పరుహౌసు అనుటకలదు. రాజున్నచోట ఈరెంటికితోడుగా రాజొక్కడు. రాజులేనిచోట దేశములోని యుత్తమాధి కారముపొందిన అధికారియుండును. ఇతనిని అధ్యక్షుడనుట కలదు. ఇతర పేళ్ళును దేశమునుబట్టి యేర్పడుటకలదు. రెండుశాసనసభల యధికారమును ఈమూడవయధికారి యధికారమును చేరియే శాసననిర్మాణాధికారమగును. ఆంగ్లభూమిలో రాజుతోకూడిన శాసననిర్మాణాధికార మములులోనున్నది.

చరిత్రలో రెండుసభ లెట్లేర్పడినవో యాలోచింతము. ప్రజలు కన్ను తెరచి 'మాప్రతినిధులు శాసనములు చేయు నధికారముకలవారుగా నుండవలె'నని కోరునప్పటికి రాజులును, రాజులనాశ్రయించిన ప్రభువులును, సామంతులును సర్వాధికారులుగా నుండినారు. రాజు లేమిచేసినను వారియనుచరు లైన ప్రభువులు సామంతులు సలహా లీయవలసియుండినారు. అందుచేత ప్రజలు నిరంకుశులగు రాజుల నుండి శాసనాధికారమును చేజిక్కించుకొను పోరాటమునందు, రాజుల అనుచరులగు ప్రభువులకును సామంతులకును గూడ స్థాన మీయవలసి వచ్చినది. మొదట మొదట వారికి బలీయమైన స్థానమే దొరకినది. అట్టివారిసభలకే శిష్టసభలని వ్యవహారముండినది. క్రమక్రమముగా ప్రజావ బోధమయి జనులు తెలివితేటలుసంపాదించి తమహక్కులను స్థాపించుకొననారంభించిన తరువాత ప్రభువులబలము తగ్గి వారు శాసననిర్మాణాధికారమున నొక్కశకలము