పుట:Prabhutvamu.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ప్రభుత్వము

యాలోచించు వారుండరు. సమావేశము చేయవలసివచ్చినప్పుడు అనేకులు హాజరుకాకపోవుటయు సంభవించును. ఆథెన్సు చరిత్రమును చదివినవారలకు ఒక్క విషయము జ్ఞాపక ముండవచ్చును. అచ్చట శాసనములను చేయునట్టి సమయమున పౌరులను తెచ్చి చేర్చుటకుగాను ప్రత్యేకము అధికారులు రంగుపూసినత్రాళ్లను గొనిపోయి వాని యావరణములోనికి పౌరులను నిర్బంధించి తెచ్చు చుండిరనుట స్మరణకు రావచ్చును. నేటిదినము ఆంగ్లభూమిలో శాసననిర్మాణమునకు అందరు ప్రజలు వచ్చుటలేదు. 615 గురు ప్రజాప్రతినిధిసభకు రావలసియున్నారు. వీరిసభకే పార్లమెంటు (హౌసుఆఫ్ కామన్సు) అనిపేరు. వీరిని అత్యవసరసమయములలో ఎక్కువ సమ్మర్దముగా రాబట్టుటకు 'చబుకు' అనునట్టి అర్థమునిచ్చు ఆంగ్లపదమయిన 'వ్హిప్పు' అనుపేరుతోబరగు నుద్యోగస్థు లేర్పడి యున్నారు, ఈవిధమగు కారణములు ప్రచారమందుండుటచేత ప్రపంచమునందలి యెల్ల రాష్ట్రములలోను నేటిదినము శాసననిర్మాణమును ప్రజలందరును నేకముగా జేరి చేయక తమతమ యనుకూలముల ననుసరించి, పలువిధములైన పద్ధతుల ననుకరించి ప్రతినిధులను నియమించుకొని వారిమూలకముగా శాసననిర్మాణము చేసికొనుచున్నారు. దీనినే 'ఎలక్షన్' పద్ధతి యనియు, 'ప్రతినిధి' పద్ధతి యనియు వ్యవహరింపవచ్చును.

రెండుసభలు

సామాన్యముగా శాసననిర్మాణమునకయి. ప్రతినిధులు రెండుసభలుగా నేర్పడుచున్నారు. అచ్చము