పుట:Prabhutvamu.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ప్రభుత్వము

యము చేయునట్టి అధికారము రాజుది. ఒక్కపర్యాయము నిర్ణయముచేసినపిదప నియమితుడైన జడ్డీ అధికారమునందుండగా అతనికి నష్టమగురీతిగా జీతములు బత్తెములు మార్చే అధికారము రాజుకుకూడలేదు. ఇట్టి విధానములే హైకోర్టుజడ్జీలవిషయమునందును అమలులో నున్నవి. గవర్నమెంటు అఫ్ ఇండియాఆక్టుకు సంబంధించియు దానిక్రిందచేసే ఆర్డర్సు ఇన్‌కౌన్సిలుకు సంబంధించియు స్వదేశసంస్థానములు ఇతరరాజ్యాంగముల బాంధవ్యములకు సంబంధించియు అసలు అధికారము ఫెడరల్ కోర్టుదే. క్రింది. హైకోర్టులు ఈసంబంధములో చేయు తీర్పులపై న ఈకోర్టుకు అప్పీలుండగలదు. ఇండియా శాసనసభలవారు శాసనముచేసి హైకోర్టులమీద సివిలు కేసులలో ఫెడరలుకోర్టును అప్పీలుకోర్టుగా నిర్ణయించవచ్చును. ప్రీవికౌన్సిలుకు అప్పీళ్ళట్టి సందర్భాలలో పోకూడదని నియమింపవచ్చును. గవర్నమెంటు అఫ్ ఇండియా ఆక్టుక్రింద ఆర్డర్సు ఇన్‌కౌన్సిలు స్వదేశసంస్థానముల ఇన్‌స్ట్రుమెంటు అఫ్ అక్సెషనుక్రింద అసలు వ్యాజ్యెములు ఫెడరలుకోర్టులో వేసినప్పుడు ప్రీవికౌన్సిలుకు అప్పీళ్లుండును. ఇతరకేసులలో ఫెడరలు కోర్టువారియొక్కగాని, గాని ప్రీవికౌన్సిలువారియొక్క అనుమతి పొందిననే అప్పీలు పెట్టవచ్చును. ఇండియను శాసనసభలు తీర్మానముచేసిన సందర్భాలలో అప్పీలుండదనుట స్పష్టము.

రెండు ముఖ్యాంగములు

న్యాయవిచారణశాఖయందు రెండు ముఖ్యాంగములు గమనింపదగినవి. వానిని 1 కోర్టులు 2 పంచాయ