పుట:Prabhutvamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

105

జీతముకలవాడు ఉత్తమన్యాయాధికారి. ఇతనికి జీతము 15,000 డాలర్లు (సంవత్సరమునకు) ఇతనితోడి న్యాయవిచారణకర్తలకు, 14, 500. రాష్ట్రములోని ఇతరోద్యోగులలో నెవ్వరికిని 12,000 డాలరులకు పై బడిన జీతము లేనేలేదు.

క్రొత్తగవర్నమెంటు అఫ్ ఇండియాశాసనము క్రింద మనదేశమునకు నొక యుత్తమన్యాయస్థానము నేర్పరచినారు. దీనిపేరు ఫెడరలుకోర్టు అనినారు. ఈకోర్టు జడ్జీలను ఇంగ్లండులోనుండు రాజు నియమించును. బ్రిటిషు ఇండియాలోని హైకోర్టులోగాని బ్రిటిషు ఇండియా ప్రభుత్వముతో ఫెడరేటు చేసుకొనే (కొన్ని కార్యాలకు ఒక్కటిగా చేరుకొనే) స్వదేశసంస్థానపు హైకోర్టులోగాని ఐదుసంవత్సరాలైనను జడ్జిగానుండి యున్న వారై నను, అట్టి హైకోర్టులలో పది సంవత్సరములుగా ప్లీడరీ చేసినవారై నను, ఇంగ్లండు ఐర్లండులలో పదేండ్లు బారిస్టరీచేసిన వారైనను స్కాట్లండులో పదేండ్లు అడ్వకేటుగా నున్న వారైనను, అయిననే తప్ప ఈ జడ్డీపదవులకు నియమితులు కారాదు. అందులో చీఫ్ జస్టిసుగా ఉండడానికి పదునేనేండ్ల అనుభవమును, ఇతర నియమాలును కలవు. ఈ జడ్డీలకు 65 ఏండ్ల వయసు వచ్చేవరకు వీరు అధికారమునందుందురు. వీరే రాజీనామా యిచ్చినా, లేదా దేహదౌర్బల్య మనోదౌర్బల్యముగాని దుష్టప్రవర్తనగాని కారణముగా రాజు స్వహస్తాక్షరిక్రింద తీసివేసినా తప్ప వీరిని పనినుంచి తొలగించు అధికారము వేరులేదు. వీరి జీతము బత్తెములు నిర్ణ