పుట:Prabhutvamu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ప్రభుత్వము

వ్యామోహమునకును ఎడమీయనియంత సౌఖ్యమునకు దగిన జీతములు వీరి కేర్పడవలయుననుట సిద్ధాంతము.

వైపరీత్యములు

ఇంతటి యాలోచనలు చేసియు న్యాయవిచారణకర్తలు ఇంకను కొన్నిదేశములలో పరిపూర్ణస్వాతంత్ర్య మును కనుబరచుటలేదు. ఇటాలియారాజ్యమునందు న్యాయవిచారణకర్తలను ఒక తావునుండి యొకతావునకు మార్చునట్టి యధికారము అధికారశాఖవారికి నుండుటను బట్టి అచ్చటి న్యాయవిచారణాధికర్తలు కొంతకుకొంత స్వాతంత్ర్యము గోలుపోయినవారుగ నున్నారట! ఆంగ్ల సామ్రాజ్యములోని మనదేశమునందు అధికారశాఖవారికే న్యాయవివరణాధికారము చేతి కబ్బియున్నది. జిల్లా కలెక్టరునకును, అతనికి లోబడిన యధికారులకును న్యాయవివరణకు సంబంధించిన యధికారములు ఎక్కువగాకలవు. అందుచేతనే అధికారవర్గమువారు తలధరించు నధికారమునకును మేరలేకయున్నది. మనదేశమునందు ప్రాంతములకు ఉత్తమన్యాయస్థానములు ను, జిల్లాలలో జడ్జీల విచారణయుకలదు. కాని ఉత్తమన్యాయస్థానములోనే కొన్నిపదవులు తాత్కాలికములుగా గణించి వానికి మన గవర్నరులే తమకు తోచినవారిని నియమించుట సంభవించుచున్నది. ఈయెల్ల సందర్భములును న్యాయవిచారణాధికారుల స్వాతంత్ర్యమునకు భంగ కరములు. న్యాయవిచారణకర్తలకు ముఖ్యమంత్రితో సమానమైన జీతములుకలవు. అమెరికా సంయుక్తరాష్ట్రమునందు ఉత్తమాధికారియైన యధ్యక్షునకు తరువాత