పుట:Prabhutvamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

107

తులు అని యనవచ్చును.

కోర్టులు

కోర్టులు సాధారణముగా అచ్చట విమర్శింపబడు వ్యాయోగములను బట్టి రెండగొప్పశాఖలుగా నేర్పడి యున్నవి. సివిలు కోర్టులు, క్రిమినలు కోర్టులు. ఇది యెల్లరును దినదినమును అనుభవమున నెఱిగిన సంగతియే, ఈవిభేదమునకు కారణము తెలిసికొనందగి యున్నది. మనుష్యునకు మనుష్యునకు వివాదము అనేకవిధముల కలుగవచ్చును. అప్పుతీసికొని యీయకపోయినప్పుడు వివాదము కలుగవచ్చును. భూమిపంపకము విషయములలో కలుగవచ్చును. వ్యాపారమునందు ఎవ్వరెవ్వరికి నెంతెంత భాగము లాభము చేరవలయునను విషయమై వివాదము కలుగవచ్చును. ఆస్తియేదైనను ఎవ్వనికి చేరినది యని నిర్థరించుకొనుటలో వివాదము కలుగవచ్చును. వీనియందు నిర్ణయము కావలసిన విషయము రెండు పక్షములవారికి మాత్రము పరస్పరము సంబంధించినది. ఈ వివాదములవలన చెడినను బ్రతికినను ఆరెండు పక్షములవారికి మాత్రమే అది యన్వయమగును. ఇందువలన సంఘమునకు కలుగునట్టి యపాయము ఏమియులేదు. మరి యింకొక విధమగు వివాదముల నాలోచింతము. ఒకనిసొత్తు నింకొక డపహరించినాడు. ఒకని యాస్తి నింకొకడు దొంగిలినాడు. ఒకని నెత్తి నింకొకడు బద్దలు కొట్టినాడు. పదుగురుచేరి బజారులో నల్లరిచేసినారు. ఇవియన్నియు సంఘమున కపకారము చేయునట్టి పనులు. వీనిలో కొన్ని పరస్పరము ఇరువురకేగలుగు వివాదములైనను