పుట:Prabandha-Ratnaavali.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

అందుబాటులో నున్నది. ద్వితీయ సంపుటముగా రావలసిన సామగ్రితో కూడి సమగ్రమైన సంకలనము చాటుపద్యమణిమంజరి తిరిగి ముద్రింపవలసిన ఆవసరమెంతేని కలదు. ఇట్లే వారి “నీతినిధి" వంటి ఉత్తమ వచన గ్రంధములు, "శృంగాశ్రీనాథము" వంటి మేటి విమర్శ గ్రంథములు పునర్ముదణ మందవలసి యున్నవి. ఇట్లే ఇంకను వారి రచనలు కథలు-గాథలు; జాబులు-జవాబులు; డైరీలు; గ్రంథపీఠికలు, టీకలు-టిప్పణములు; సమీక్షలు;ఉపన్యాసములు; వ్యాఖ్యలు-విశేషములు, ఆత్మకథ 'ప్రజ్ఞాప్రభాకరము'; జీవితము-యోగము ఆను విభాగములతో ననేక సంపుటములును;—సామెతలు - నానుళ్ళు, గాంధిరామాయణము మున్నగు సంకలనములు మఱికొన్నియును క్రమమున ముద్రింపవలసియున్నవి.

ఇట్లే ఇంకను పలువ్రాతప్రతులను పరిశీలించి పాఠనిర్ణయము గావించి ప్రకటనకు సిద్ధముచేసి యుంచిన ప్రాచీనకావ్యములు కొన్ని యున్నవి. 'లక్షణోధార' మను లక్షణగ్రంథవిషయ సంకనమునకు బ్రృహత్ర్పణాళికను రచించి, సామగ్రిని సేకరించి, విశ్లేషించి యున్నారు. అదియు వెలుగునకు రావలసియున్నది.

ఇట్లు శ్రీ వేటూరి ప్రభాకశాస్త్రిగారి సంపూర్ణగ్రంథావళి ప్రణాళికాబద్ధముగ క్రమమున వెలుపరింపవలసియున్నది. ఈ రచనాసామగ్రి నంతటిని శ్రీ ప్రజాకరపరిశోధకమండలి పరిశ్రమించి సేకరించి, పైని వివరించిన విధమునే విశ్లేషించి ప్రకటించుటకు సిద్ధపఱచియున్నది. త్రత్పకటనమున కొకప్పుడు కొంత యత్నించిమి గాని ఆయత్నము ఫలింపలేదు.

గ్రంథప్రకటన మనుకొన్నంత తేలిక పనికాదని తెలియును. ఆది మాటలతో జరగునదియు కాదు. అయినను దీక్షతో వానినన్నిటి నొక క్రమప్రణాళిక ననుసరించి ప్రకటించుట కిపుడు శ్రీ ప్రభాకరపరిశోధక మండలి కృషిచేయుచున్నది.

ప్రథమ ముద్రణము జరిగిన యేఁబదియెనిమిఁదేండ్ల తరువాత నిప్పటికీ విలువగల సంకలనగ్రంథము ‘ప్రబంధరత్నావళి’ పునర్ముద్రణమందు చున్నది. దీనికై ఆర్థింపఁగా ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీవారు దయతో మూడువేల రూపాయలు, రెండేండ్ల వ్యవధిలో, వడ్డీ లేక తీర్చుకోవలసిన విధమున, అప్పుగా