పుట:Prabandha-Ratnaavali.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనవి

శ్రీ ప్రభాకరపరిశోధకమండలి పక్షమున కీ॥ శే॥ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు మున్ను రచించినవియుఁ గూర్చినవియు నగు గ్రంథములు కొన్ని నవ్యములును పునర్ముద్రణములును వెలువడినవి. అవి నేటికి చాలవఱకు చెల్లిపోయినవి కొన్ని మాత్రమే, కొలంది మాత్రమే మిగిలియున్నవి. “తెలుగు మెఱుగు' లతో (1948) నారంభమైన శ్రీ ప్రభాకరశాస్త్రి గారి వ్యాససంకలనములు పిదప 'మీగడ తఱకలు', 'సింహావలోకము' అను మఱిరెండు సంపుటములు వెలువడినవి. ఇంకను వారివి ప్రాచీనసాహిత్యమునకును, సంస్కృతాంధ్ర కవుల చరిత్రకును సంబంధించిన వ్యాసములు కొన్నియును; జానపదసాహిత్యము, చరిత్ర, శాసనములు, భాష మున్నగు విషయములకు సంబంధించిన వ్యాసములు కొన్నియును సంకలన రూపమున ప్రకటింపవలసినవి కలవు. శ్రీ ప్రభాకరశాస్త్రి గారు 1950 కంటె పూర్వము నాలుగాశ్వాసములకుపైపడి రచించిన ఉత్తర హరివంశ వ్యాఖ్యానము, వారే పరిష్కరించియుంచిన పద్యపాఠములతో కూడ ప్రకటింపబడవలిసి యున్నది.

ఇంకను నాటకములలో వారి ప్రతిమానాటకము పునర్ముద్రణ భాగ్యమును బడసినది. శ్రీ శాస్త్రిగారు సగమే ఆంధ్రీకరింపగా మిగిలిన భాగమును డా॥ దివాకర్ల వేంకటవధానిగారిచే పూరింపఁజేసి నాగానందనాటకము ను వెలువరించు టైనది.

ఇంకను వారి భాసనాటకానువాదములు, తెలుఁగుచేసిన ప్రహసనములు, స్వతంత్రములగు నాటికలు కొన్నియును, కలిపి, నాటకసంకలన మొకటి వెలువరింపవలసియున్నది. ఇక పద్యకృతులలో 'దివ్యదర్శనము' 'కపోతకథ' 'కడుపుతీపు' మున్నగు లఘుకృతులొండు రెండు పునర్ముద్రణమందినవి. ప్రభాకర కవిచూడామణి కృతములైన కావ్యఖండికలన్నియు వారెడనెడ చెప్పిన పద్యావళితో పాటు చేర్చి కూర్చిన కావ్యసంకలన మొకటి వెలువడ వలసియున్నది. శ్రీ శాస్త్రి గారి చాటుపద్యమణిమంజరి రెండు భాగములు ముద్రింప బడినవి! విస్తరింపబడిన ద్వితీయ భాగమున ప్రథమ సంవుటము మాత్రమే నేటికి