పుట:Prabandha-Ratnaavali.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36


ఇంచు

నన్నయ పూర్వయుగము (క్రీ శ. 850-1000)

జై నసాహిత్యము

నన్నయకు పూర్వము తెలుగులో సాహిత్య మున్నదనియు నది జైన సాహిత్యమనియు మొదటిసారిగా నిరూపి:చినది ప్రబంధరత్నావళి-ఇందు

పద్మకవి జినేంద్రపురాణము. సర్వదేవుడు - ఆదిపురాణము.

ఆను రెండు కావ్యములనుండి పద్యములుదాహరింపబడినవి. వీనినిగూర్చి పీఠికలో (27 పుట, నిట్లున్నది.

“ద్రవిడ కర్ణాటభాషలలో జైనకృతులు పెక్కులున్నవి. జినేంద్రపురాణమనియు నాదిపురాణమనియు రెండు జైన ప్రబంధము లుదాహ రింపబడినవి. కాని వానియందలి పద్యము లేక్కువగా జేకొనబడవయ్యెను. ఉన్న పద్యములం జూడగా ప్రాచీనతర రచనముగా దోపకున్నది." నేను వీనినిగూర్చి పరిశ్రమచేసి-ఇవి ప్రాచీనములనియు, తేలుగున జైన సాహిత్యమునకు సంబంధించిన కృతులనియు నిర్ణయించితిని.

పద్మకవి జినేంద్రపురాణము (క్రీ శ. 841)

ఈ పద్మకవియే కన్నడ వాజ్మయమున ఆదికవియని ప్రసిద్ధిగాంచిన పంపమహాకవి. పద్మక ఏ పంపకవియేయని “నాడోజపంప" అను గ్రంథమున నిర్వివాదముగా నిరూపింపబడినది. పంపమహాకవి తెలుగుదేశమున కరీంనగర మండలమున వేములవాడ నివాసి వేములవాడ కధీశ్వరుడైన అరికేసరి ఆస్థానకవి పంపకవి. తెలుగు బ్రాహ్మణుడు, జైనమతము నవలంభించినవాడు. సోదరుడు జినవల్లభుడు వేయించిన శిలాశాసన మొకటి నేడు బయలుడినది. అందు 3 తెలుగు కందపద్యము లుండుట విశేషము. దీనినిబట్టి పంపకవి తెలుగున కవియని మనము నిశ్చయింపవచ్చును.

పంపకవి తన గురువైన జినేంద్రముని చరిత్రమును జినేంద్రపురాణము గా తెలుగున రచించినాడు. ఇందుండి యొక్క పద్యము మాత్రము నేడు మనకి గ్రంథము ద్వారా లభ్యమైనది (చూ. నాతెలుగుకవుల చరిత్ర పుటలు 83-86)