పుట:Prabandha-Ratnaavali.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35


ప్రభాకరశాస్త్రి గారు తమ గ్రంథపీఠిక యందు తాము సంధానించిన విధా నము నిట్లు తెలిపిరి.

“ఇందలి పద్యములను సంకలనము చేసిన వారిర్వురు. ఒకడు పెదపాటి జగన్నాథకవి. నారాయణస్తుతి, శంకరస్తుతి, త్రిపుర విజయము, అర్ధనారీశ్వ రమునని మొదలు పెట్టి తెలుగున బెక్కువర్ణనాంశముల నేర్పఱచుకొని యై దొశ్వాసములుగా 'ప్రబంధరత్నాకర'మను పేర గ్రంథము రచించెను. పై గ్రంథ మున మొదటి మూడాశ్వాసములు మాత్రమే తంజావూరి సరస్వతీ పుస్తక భాండాగార మందున్నవి. కడమ గ్రంథమెక్కడ నున్నది కానరాదు. వేఱొక్కని పేరు తెలియరాదు. అతని సంధాన మాంధ్ర సాహిత్య పరిషద్భాండాగారమున నున్నది. ఆ సంధానమునకు బేరులేదు మొదలు లేదు తుదిలేదు - పరిషత్తువారుదాహరణ పద్యములని పేర్కొన్నారు. ఈ యిర్వుర కూర్పులందలి పద్యములను గ్రుచ్చి యెత్తి నేనీ ప్రబంధరత్నావళిని గొత్త వెలయించితివి".

పైదానిని బట్టి-ప్రబంధరత్నావళి కాధారములు, 1.జగన్నాధకవి ప్రబంధరత్నాకరము 2.ఉదాహరణ పద్యములు.

వీనిలో , ఉదాహరణ పద్యములు పరిషత్పత్రికలో ముద్రితములైనవి. మొదటిదగు ప్రబంధరత్నాకరమును గూర్చి వివరములు తెలిసికొనుట యావశ్యకము

తంజావూరి పుస్తకశాలలోని గ్రంథ వివరములు.

189. ప్రబంధరత్నాకరము- పేదపాటి జగ్గన Prabandbaratna- karamu-Pedapati Jaggana M. 382.S.C.187 X 1; d-162 = 114: G. 3240,

యుగ విభజనము

ప్రబంధరత్నావళి తెలుగు సంకలన గ్రంథములలో కాలక్రమమున ద్వితీయమైనను-ప్రాచీన కావ్యోదాహరణములను ప్రపంచించుటచేత నద్వితీయ మైనది. ముఖ్యముగా ఆంధ్రవాజ్మయ చరిత్ర గ్రంథమెట్లు తోడ్పడినదియు వివరించుచున్నాను.