పుట:Prabandha-Ratnaavali.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29


రామలింగయ్య-తెనాలి. రామకృష్ణుఁడు వేఱు, రామలింగఁడు వేఱుగా

మా. రా. కవిగారు వ్రాసినారు[1]. సత్యము కావచ్చును.2[2]

  1. 1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక. 1. క్రీడాభిరామపీఠిక చూడుఁడు.
  2. 2.

    ఉ, గ్రాంథిక సన్నుత ప్రతిభఁ గాంచి రసజ్ఞత మించి యాదిమ
    గ్రంధము లాగ్గడించి ఫణిరాట్పరికల్పితశాప్రవీథికిన్
    బంధువు లైనసత్కవులఁ బ్రార్థన చేపెద దుష్ప్రబంధ సం
    బంధమహాంధకారథరభానుగ భీరపచోమచర్చికన్,

    నీ. మహిత మూలస్థావమల్లికార్జున శిరస్థలచంద్రచంద్రికా ధవళితంబు,
    చెదలువాటిపుర శ్రీరఘూద్వహభుజా స్తం భరక్షలు విధాసంభృత: బు,
    వేదండముఖతటాకోచిత పద్మ సౌగంధికి గంధ పాణి ధమంబు,
    రాజబింబాననారాజిత గాంధర్వ మాధురీ సాధుర తీధరఁబు,

    గీ, కరటికటనిర్గ ధ్వాననిరవధిక సమగనూతనవృష్టిజంబాలితాఖి
    లాసనీ పాలమందిరప్రాంగణంబు ! గురుసమృద్ధుల సైదోడు కొండవీడు

    మ. పరగన్ వారిధి వేష్టితాఖిల మహిభాగంబునన్ రెడ్డిభూ
    వరసింహాసన మై గుభాయతన మై వర్ధిల్లు తత్పట్టణం
    బురుబాహాబలసంవదం బెసుచు శద్రోద్యోగి నాదెండ్ల గో
    పరసాధీశుఁ డ శేషబంధుకుముదప్రాలేయధామాకృతిన్ .

    గద్యము. ఇది శ్రీమదే లేశ్వరగురువరేణ్యచరణారవిందషట్చరణ సకలకళాభరణ రామ నార్యసుపుత్ర సుకవిజనమిత్ర కుమార ఖారవిదిరుదాభిరామ రామలింగయప్రణితం బైస యుద్భటారాధ్యచరిత్రంబునఁ ...... ......... ............. .........

    మన్మిత్రులు చల్లా సూర్యనారాయణరావుపంతులుగారు దీనిని బంపినారు. పాండురంగ మాహాత్మ్యకర్తయు, నేతత్కృతికర్తయు నొక్కఁడే యని గాని, వేఱనిగాని నిర్ధారింపఁ దేలకున్నది. అతఁడు నీతఁడును రామయపుత్రులే. "తైన వైష్ణవపురా ణావళినా నార్ధరచనాపటిష్టైకరమ్యమతివి. " కావున నాతఁడుకూడ నీ వకథ రచియించి యుండఁ దగును, అక్కడ రామకృష్ణుఁడని యిక్కడ రామలింగఁడని యున్నది. ఇక్కడఁ దెనాలి ప్రశంసకానరా లేదు. ఈ యుద్భటారాధ్యచరిత్రము కూడ బయల్పడినఁగాని యదార్ధముతేలదు. ఇందుదాహరింపఁబడిన పద్యమందు నాదెండ్ల గోప మంత్రి పేర్కొఁబడినాఁడు. ఈ రామలింగనికి గుమారభారవి యవి బిరుదు.