పుట:Prabandha-Ratnaavali.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30


వల్లభరాయుడు.. శ్రీ మా. రా కవిగారు వల్లభరాయఁడు రచించినట్టున్న క్రీడాభిరామ! మను వీధినాటకమే శ్రీనాథుని వీధి నాటకము కావచ్చు ననిరి. శ్రీ కం. వీ, పంతులుగా రది“యతిసాహస' మనిరి. నా నిశ్చయము తప్పక యది శ్రీనాథునికృతియే యగునని; కారణసామగ్రి పుష్కలముగా నున్నది. ముద్రింపఁబడునా "శృంగార శ్రీనాథ" మను గ్రంథమున నీచర్చ కలదు

శేషనాథుఁడు :-ఈతనిపర్వతపురాణము ముద్రితము

శ్రీనాథుఁడు-- వల్లభాభ్యుదయ మను శ్రీనాథకృతి యొక్కటియన్నట్టిం దలి యొక్క పద్య మెఱిగించుచున్నది. వల్లభాభ్యుదయమునుగూర్చి శ్రీ మా. రా. కవిగారిట్లు వ్రాసినారు. “వల్లభాభ్యుదయములోఁ గృష్ణాతీరమున నుండు శ్రీకాకుళస్వామి తిరునాళ్ళలో జరుగు నసభ్యములు దీనికంటెఁ బచ్చిగానున్నవి. మఱియు నాంధ్రవల్లభుని తిరునాళ్లలోని విధవాదుర్వర్తనములు శ్రీ నాథుఁడు విశదముగా వర్ణించియున్నాఁడు...... శ్రీనాథుఁడు శ్రీకాకుళాధీశ్వరుఁడగు తెలుఁగురాయని దర్శించి యతని కంకితముగా వల్లభాభ్యుదయమును జెప్పేసు గదా ! అప్పుడు 'అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ ' అని శ్రీనాథుఁడు చెప్పెను" ఈ వ్రాఁత శ్రీ కవిగారావల్లభాభ్యుదయమును జక్కఁగాఁ యెటి:గినవా రనిచెప్పుచున్నది గదా ! ఆ గ్రంథము శ్రీకాకుళాధీశ్వరుఁ డగు తెలుంగురాయఁని కంకిత మట! అతఁడేయట సొంపరాయని తెలుంగురాయఁడు, సాంపరాయని తెలుంగురాయఁడు కృష్ణాతీరమందలి శ్రీకాకుళ మునేలినాఁడనుట కట్టుకత. ఆధారము లేవియునులేవు. ఈ విషయమునఁగల యసందర్భములు పూర్ణముగా నా "శృంగార శ్రీనాథము. "న వెల్లడింపఁబడినవి. ఇప్పటికి నఱువది యేండ్ల కుఁబూర్వ మొకకు శ్రీకాకుళ క్షేత్ర మాహాత్మ్యమును వల్లభాభ్యుచయ మన పేరఁ దేల్గించినాఁడు అది యున్నది. శ్రీ రాథునీ వల్లభాభ్యుదయమునుగూర్చి యందలి పద్యమొకటితకు మనకిఁక సమియుఁదేలియదు. శ్రీ కవిగారు గ్రంథ

మును జదివినట్లు వ్రాయుచున్నారు వారు దానిని వెలడింపవలసి యున్నారు.1[1]

  1. 1. మా.రా. కవిగారు, క్రీడాభిరామఁపుభీఠిక లో నే యిట్లు వ్రాసినారు. "చంద్ర శేఖరుఁ డను నియోగిపుంగవుఁడు నరసింగరాయలమంత్రి యని పాళువాభ్యుదయమున నున్నది. కావున "చంద్రశేఖరుక్రియాశ క్తిరాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమ బిరుదు” అనునది స్పష్టముగా నర్థమగుచున్నది." స్వాళ్వాభ్యుద