పుట:Prabandha-Ratnaavali.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28


"లలోని యొక తాళపత్ర ప్రతిలోఁ జూచి దానిని జాటుపద్య మణిమంజరిలో 'తెలుంగాధీశ' యనుటకు బాఠాంతరముగా ముద్రించితిని. లోకమువాకు లందుఁ దెలుంగాధీశ యన్న పాఠమే పాదుకొనియుండు టనుబట్టియు శ్రీనాథు నకుఁ గస్తూరికా భిక్షాదానము సల్పిన తెలుంగురాయని పేరే భీమకవికూడఁ గస్తూ రికా భిక్షమే యాచించినవాని పేరుగా నండుటలో సందర్భవిశేష ముండఁ దగి యుండుటను బట్టియుఁ ద్రోసిపుచ్చుటకు సాహసింపక ప్రధానపాతముగా "దీనినే యుంచితిని ఈ పాఠము పరిత్యజ్య మనుటకు వ్యాకరణముష్ట మనెడుకార ణము తగనిది. ఇతర విధములఁ 'గళింగాధీశ ' యన్న పాఠము పరిగ్రాహ్యతరము కావచ్చును

మఱియు వీరేశలింగముపంతులు గారు “సోమ గురువాక్యములు పెట్టి భీమ సుకవి, గరిమ బసవపురాణంబు గణనచేసె "సని పిడుపర్తి బసవన బసవపురాణ పద్యమును గొని వ్యాఖ్యానచాతుర్యముచే “గణనచే సె' ననుటకుఁ గర్ణాటీకరించు టగా నర్థముఁ గూర్చి, పాల్కురికి సోమనాథుని యాంధ్రబసవపురాణమునుబట్టి కర్ణాటభాషలో భీమకవిచే రచియింపఁబడిన బసవపురాణము నుదాహరించి యా యర్థమును స్పష్టపఱిచిరి. పిడుపర్తి బసవన బసవపురాణపుఁ దాళపత్రప్రతు లలో “గరిమ బసవపురాణంబు కన్నడించె" సని యున్నది గావున వ్యాఖ్యాన శ్రమ మక్కఱలేక యే యయ్యది కంథోక్త మగుచున్నది. కాని యా భీమకవియే వేములవాడ భీమకవి యని పంతులవారు పల్కుటకుఁ బ్రమాణమో ! లేదు వేములవాడ భీమకవి చాటుపద్యములలోఁ గూడ దాక్షారామ భీమేశ్వరుని స్మరించి యున్నాఁడు. కర్ణాటక బసవపురాణకర్త యాతఁడే యగునాఁ డందలి యెన్మి దాశ్వాసములలో నెక్కడ నేని భీమేశ్వరుని స్మరింపకుండునా ? తెలుఁగుఁగవీళ్వ రులచే స్తుతింపఁబడుట కాతఁ డేవేని తెలుఁగుఁగబ్బములను గూర్చియే యుండ వలెను గదా ! ఏవో యవి చేకుఱవలసియే యున్నవి. ప్రయోగరత్నాకరమున వేములవాడ భీమకవి నృసింహపురాణమందలివని కొన్ని పద్యము లుదాహరింప బడినవి. ఎంత నిజమో ! వీరేశలింగముపంతులుగా రీతఁ డారాధ్య బ్రాహ్మణుఁ డనిరి.కోవెల గోపురాజు నన్నయభట్టును భీమక విని వేఱుగా స్తుతియించి, తిక్క నాదులను ““మళ్కులచంద్రు"లని తర్వాతఁ జెప్పుకొన్నాఁడు. మీఁది చర్చవలస వేములవాడ భీమకవి విషయము సర్వమును సందిగ్ధమే యగుచున్నది.