పుట:Prabandha-Ratnaavali.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17


తిమ్మయ్య, కుంటముక్కల :- ఈతని శైవాచార సంగ్రహము1[1]దొరకి యున్నది.

త్రిపురాంతకుఁడు, రావిపాటి :. ఈ కవీశ్వరునికృతి 2[2] యుదాహర ణము మాత్రమే సమగ్రముగా దొరకియున్నది. తారావళి, అంబికాశతకము, పేమాభిరామము దొరకలేదు. క్రీడాభిరామమునకు సంస్కృతమైన ప్రేమాభి రామమును రచియించుటచేతనే యేమో యీతనిఁ గూచిరాజు - ఎఱయి యిట్లు తన కొక్కోకమునఁ బేర్కొన్నాఁడు.

“సి-గీ, ముని సనత్కుమారు ధనదతనూభవు
నాశ్వినుల జయంతు నభిన తించి
పృథివి రావిపాటి త్రిపురాంతకాదిశృం
గారకవుల నెల్ల గౌరవించి."


ప్రేమాభిరామము శృంగారకావ్యమే యగును గదా ! రామకృష్ణకవిగారు త్రిపురాంతకు (డు మదనవిజయ మను కామశాస్త్ర గ్రంథమును ( వాత్స్యాయన సూత్రఘులకుఁ దెలుఁగఁట) రచియించెనని వ్రాసినారు. [3]3 దొరకినంతవఱకుఁ బరి కింపఁగా నీతనీయాంధ్రకవిత యతిప్రశస్తముగా నున్నది. ఈ క్రింది రెండు పద్యములు గూడ సంబికాశతకమందలివి.4[4]

“చ. బెడఁ గగురత్నదర్పణముఁ బేరిన వెన్నెల పోసి నిచ్చలుం
దుడుపక పాలసంద్రమునఁ దోఁచి సుధాకరుమేనికందుఁబోఁ
గడుగక నేరెటేట సితకంజము ముంపక నై జకాంతి తోఁ
దొడరినఁ దల్లి ! నీ మొగముతో సరిపోల్పఁగఁ జాలు నంబికా !

ఉ. టెప్పలబోరుఁదల్పు లిసిటింతలు వాటెడుచూపుఁ గుంచియం
ద్రిప్పి తళుక్కనం దెఱచి తిన్న నిమోమునఁ గాయు వెన్నెలల్


1. 2. 3.

4.

  1. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో ;
  2. తంజాపూరుపుస్తకశాలలో నున్నది. శ్రీ రామకృష్ణ కవిగారు ముద్రించినారు
  3. క్రీడాభిరామ వీఠికాదులు చూడుఁడు.
  4. ప్రయోగరత్నాకరమునం దున్నవి. మా. రా, కవిగారు ఉదాహరణ పీఠికలో గూడ నుదాహరించినారు. మొదటిపద్యము సర్ధ మసందర్భముగా నున్నది. తుడువఁగ, కడుగఁగ, ముంపఁగ, తొడరిన తల్లి, అని యుండఁగూడును.