పుట:Prabandha-Ratnaavali.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

బదులు వ్రాసిరి. [1] కవిగా రట్లుపన్యసించినచో నాధార మేమో! తెలయవలసి యున్నది.

చిక్కయ, చందలూరి:- నాచికేతూపాఖ్యానము నిర్వురు తెల్గున రచియించినారు. ఈతఁడును, శ్రీనాథుని బావమఱఁది దగ్గుఁబల్లి దుగ్గనయును. ఈతఁ డేనాఁటివాఁడో! దుగ్గన నాసికేత (నాసికా + ఇత) పదమును బ్రాసమున 'స' వచ్చునట్లు సవ్యుత్పత్తికముగాఁ బేర్కొనుటచే నదే ముద్రించితిని. ఉపనిషత్తులయందు నాచికేతుపదమే కన్పట్టును. దుగ్గనకృతి శివకాంచీమాహాత్మ్యము దొరకలేదు. నాసికేతోపాఖ్యాన [2]మున్నది. చౌడయ, గంగరాజు : - కసువామాత్యున కంకితముగా నొక సాముద్రిక మున్నది. అది యీతని దగునో? ఈతఁ డేనాఁటివాఁడో? నంద(న)చరిత్రము దొరకలేదు.

తిక్కన:- విజయసేనమునందలి దని యిందు వైశ్యవర్ణన (156- వ పద్య మున్నది. ప్రబంధమణి భూషణమున నీ క్రింది పద్యము తిక్కన విజయసేనములోని దని శ్రీకవిగారు వ్రాసినారు.

“సీ. అమ్మెద ననినఁ బద్మాక్షు కౌస్తుభ మైన వెఱవక కొనియెడు వెరవు గలిగి,
     విలువ యిచ్చెద మని వేడినఁ బులిజున్నుఁ గమ్మపసిండియు నమ్మఁ గలిగి,
     యేవస్తు వెంత ప్రొ ద్దెందఱు చనుదెంచి యెంతటి కడిగిన నెదురఁ గలగి,
     తమయింట లేనియర్థము లర్థపతియింట నైన వెదకిన లే వనుట గలిగి,
గీ. తమకులాచారవర్తన [క్రమ]ము కొఱకు
     నంగడులయొప్పునకును బేహార మాట
     గాని లాభమునకు నాట గాదనంగ
     వఱులుదురు పురవరమున వైశ్యవరులు.”

ఇదియు వైశ్యవర్ణనమే. రెండుపద్యములును విజయ సేనమందలివే యగునా?

  1. శ్రీవీరేశలింగముపంతులుగా రన్యదీయములగు విషయము లనేకములు స్వకపోలసాధితములట్లు కవులచరిత్రమునఁ జేర్చినారు. ఆయా విషయముల తెలుపకుండుట భావివరిశీలకులకుఁ జిక్కుఁగల్గించును.
  2. ప్రాచ్యలిఖితపుస్తకశాలలో.