పుట:Prabandha-Ratnaavali.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ముప్పిరిగొన్న వేడుకలు మూఁగినసిగ్గ'సియాడ, బ్రీతి నీ
వప్పరమేశుఁ జూచి తనువర్ధముఁ గోంటి పొసంగ నంబికా ! "

నరసింహభట్టు, ఆమడూరి ఈతని షోడశకుమార చరిత్రముదొరకలేదు; కాని, వేఱొక కవి, వెన్నెలకంటి సూరనకుమారుఁ డన్నయామాత్యుఁడు రచియించిన షోడశ రాజచరిత్ర మొకటి దొరికినది.. [1]శ్రీ బహుజనపల్లి సీతారామా చార్యు లుగారు శబ్దరత్నాకరమున షోడశకుమార చరిత్ర మొకటియెల్లనకృతముగా నుదాహరించినారు. వారు పరికించి.. యాప్రం యెక్కడ నున్నదో !


నాగనాథుఁడు, పశుపతి :- ఈతఁడు వెన్నెలకంటి సూరనకంటెఁ బ్రాచీనుఁడే కావలెను. శ్రీ వీరేశ లింగముపంతులుగారు వెన్నెలకంటి సూరన (విష్ణు పురాణకర్త) కాలము క్రీ.శ. 1480-90 ప్రాంత మని యసమర్థ సాధనములతో సిద్ధాంతపఱచినారు. కాని, తత్కృతిపతి యగు బసవయ రాఘవుఁడు2[2] క్రీ. శ. 1628. 29 ప్రాంతమున నున్న వాఁ డగుటచే నాతఁ డంతకుఁ గొంత తర్వాతి వాక డగును.


నన్నిచోడఁడు ఈ కవి కాలనిర్ణయాదికమును గూర్చి పెక్కురు చర్చించి యున్నారు. అన్ని చర్యల పర్యవసానము నింతే. ఈ కాలమువారని సిర్ధారించుటకుఁ దగిన సాధనములు లేవు. శ్రీచిలుకూరి వీరభద్రరావుగారాంధ్రుల చరిత్రమున నిట్లు వ్రాసినారు. క్రీ. శ. 925-40 సం, ప్రాంతమున నున్న యీ సత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తన కుమారసంభపకావ్యమున నీక్రింది పద్యములోఁ బేర్కొనియున్నాఁడు.

“క. మును మార్గకవిత లోకం
బున వెలయగ దేశిక వితఁ బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున
జన సత్యాశ్రయునిఁ దొట్టి చాళుక్యనృపుల్."


1.

2.

  1. ఇది నా దగ్గజ నున్నది. గ్రంథపాతములతో నిండి యందనుకులుగా నించుకమాత్ర మున్నది.
  2. బసవయరాఘవుని శాసనము, (బట్టర్వర్తుగారి శిలాశాసనముల వాల్యూము 2 లో, నెల్లూరుజిల్లా, కనిగిరి తాలూకా శాసనములలోఁ జూడుఁడు.)