పుట:PlagiarismHandout.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యునైటెడ్ స్టేట్స్ కాఫీ రైట్ చట్టం అనుసరించి యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ " వికీపీడియా కాఫీరైట్ విషయాలు " వాస్తవికత కలిగినవి, వినయవిధేయతతో అందిచినవి లేక అస్పష్టమైనవి అయిన సృజనాత్మక రచనలు కలిగిన విషయాలను సులువుగా వర్గీకరించవచ్చు. అత్యధికమైన సృజనాత్మకత కలిగిన రచనలను సమాచారసేకరణ విధులను అనుసరిస్తూ అందించవచ్చు. " డికిన్సన్ 1830 డిసెంబర్ 14 జన్మించాడు" అనేవాక్యాన్ని కొటేషన్లు లేకుండా అందించవచ్చు. అయినా ఆరచన అంతా సృజనాత్మకమైనది ఔనా కాదా గ్రహించడంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ మార్గంలో మొత్తం రచనను తిరిగి అందించకూడదు. కామన్ నాలెడ్జ్ మరియు సృజనాత్మకారహితం అన్నది సమాచార నిడివిని అనుసరించి నిర్ణయించబడుతుంది. మంచి సంపాదకులు అది ఎక్కడ మొదలైనది అని గ్రహించగలుగుతారు.

సృజనాత్మక రచనలు కోటేషన్ల మధ్య సరైన పద్ధతిలో అందించాలి. సమాచారసేకరణ విధులను అనుసరిస్తూ సంఘటనలకు వివరణ ఇవ్వాలి.

" సమాచార చౌర్యాన్ని నివారించడం " వ్యాసాలను నిర్మించే సమయంలో విశ్వసనీయమైన ములాధారాలను చదివి తెలుసుకోవాలి. ఇతరుల ఊహలను మరియు వారి రచనలను సరైన పద్ధతిలో వాడడం తెలుసుకుని ఉండడం అతిప్రధానమైనది. వికీపీడియా సంపాదకులు ఎప్పుడు ఎలా సృజనాత్మకతకు గుర్తింపు ఇవ్వాలి? మరియు ఎలా మూలాధారాలని సేకరించాలి? వాటిని వ్యాసాలలో ఎలా చేర్చాలి కొటేషన్లు ఎప్పుడు ఇవ్వాలి? అన్నవి తెలుసుకుని ఉండాలి.

కొటేషన్

వికీసంపాదకులు సమాచారచౌర్యాన్ని అరికట్టడానికి రచయితల రచనలను యథాతథంగా అందించాలి. కొటేషన్లు వాడాలి. మూల అధారాలలో ఉన్నదానిని అలాగే కొటేషన్ల మద్య అందించాలి. అయినప్పటికీ డైరెక్ట్ కోటేషన్లు అధికంగా వాడకూడదు. ఉచిత ఆధారాలు కాకుంటే అధికమైన వాడకం కాఫీరైట్ ఉల్లంఘన క్రిందకు వచ్చే అవకాశం ఉంది. వికీపీడియా అందిస్తున్న ఉచితంకాని ఆధారాలను ఉపయోగించే విధానాలలో కోటేషన్లు ఎప్పుడు వాడాలి అన్నది వివరిస్తూ కొటేషన్లు అధికంగా వాడడం నిషేధిస్తుంది. ఉచిత ఆధారాలు ఉపయోగిస్తూ వ్యాసాలను వ్రాసేసమయంలో అధికంగా కొటేషన్లు ఉపయోగిస్తే అది కొటేషన్ల సేకరణగా పరిగణించబడితుంది. కొటేషన్లు అధికంగా ఉపయోగిస్తే విభజన స్పష్టంగ ఉండదు. పాఠకులు విషయాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు.

కొటేషన్లు క్రింది సాధారణంగా సందర్భాలలో వాడుతుంటారు.

  • " ఎప్పుడైతే వైవిధ్యమైన భావవ్యక్తీకరణ ఉంటుందో "
  • " సాంకేతిక వివరణకు ఖచ్చితమైన పదాలు ఎప్పుడు అవసరమౌతాయో ".
  • " ఎప్పుడు ఒక విషయమై వాదోపవాదాలు ఉత్పన్నమయ్యాయో. అది యథాతథంగా వివరించాలన్న ఆవశ్యకత కలిగినప్పుడు వారి వారి మాటలలో వివరించడానికి "
  • " వివాదానికి యథాతథమైన మాటలు బలం చేరుస్తాయి అనుకున్న సమయంలో "
  • " మీ చర్చలలో ప్రధానాంశానికి అవసరమైన ఆధారాలు అవసరమైనసమయంలో "