పుట:PlagiarismHandout.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధారాలు స్వీకరించడం: సరళీకరణ మరియు సంక్షేపం

సాధారణంగా సమాచార ఆధారాలు గ్రహించి సరళీకరణ మరియు సంక్షేపం ఉపయోగిస్తూ వ్యాసాలలో అందించాలి. సాధారణంగా వివరించే సమయంలో ఈ రెండు శైలిలో వైవిధ్యం ఉంటుంది. సాధారణంగా పొడవైన వివరణను తగ్గించడానికి ప్రధానాంశాలను స్వీకరిస్తూ ఉదాహరణలు మరియు వివరణలను విడవడం లేక తక్కువగా తీసుకుంటూ సంక్షేపవిధానం ఉపయోగిస్తారు. సాధారణంగా సంక్షేపం అసలు సమాచార ఆధారం కంటే తక్కువ నిడివి కలిగినదై ఉంటుంది. సరళీకరణ అసలు సమాచార ఆధారానికి సమీపమైన నిడివి కలిగి ఉండడం లేక మరికొంత నిడివి అధికంగా ఉంటుంది.

ఆధారాలు స్వీకరించే సమయంలో సరళీకరణ మరియు సంక్షేపం చేయడం విలువైన నిపుణత కలిగి ఉండడంగా భావించవచ్చు. వికీపీడియా సంపాదకులు సమాచారసేకరణ విధులను అనుసరించడంలో అప్రమత్తులై ఉండాలి. అనేక మంది వికీసంపాదకులు ఇక్కడా అక్కడా కొన్ని పదాలను మార్చడం లేక మూలాధారంలో ఉన్న పలు పదాలను మార్చడం ద్వారా సమాచారచౌర్యాన్ని అరికట్టవచ్చని విశ్వసిస్తారు. ఇది అవసరం లేదు. ఉపవాఖ్యాలు లేక వాఖ్యాలు లేక పారాగ్రాఫ్ మార్చడం సమస్యకు మార్గం కాదు.

" సరళీకరణ చేయడంలో సమస్యలు " ఈ ఉదాహరణలో : వికీపీడియా వ్యాసాలలోని సమాచారం మూలాధారం లోని సమాచారాన్ని సరళీకరణ చేసేప్రయత్నం జరిగింది. మూలాధారంలోని పదాలు, పదక్రమణం మరియు వాక్యనిర్మాణం దాదాపు పూర్తిగా ఉపయోగించబడ్డాయి.

" మూలాధారం " సమాచారం అందుకున్న(రిసీవర్) వారి అంగీకార ప్రకటన: డేలోట్టీకి చెందిన డేవిడ్ కర్సన్ 670 ఉద్యోగులలో 480 మంది తిరిగి నియమించబడ్డారు....కనీసం 100 మంది వాటర్ ఫోర్డ్ ఉద్యోగులు ఈరాత్రి ఫ్యాక్టరీ లోని సందర్శనశాలను (విజిటర్స్ గ్యాలరీ) ని వదిలి వెళ్ళాడానికి నిరాకరిస్తున్నారు. అలాగే అనధికార బైఠాయింపు ప్రదర్శన చేస్తున్నారు. మిస్టర్ కార్సన్‌ను నేరుగా కలిసే వరకు వెళ్ళమని ఉద్యోగులు అంటున్నారు... ఇక్కడ జరిగిన చిన్నపాటి ఘర్షణలో సందర్శనశాల ముఖద్వారం దెబ్బతిన్నది. ప్రాంతీయ సిన్ ఫెయిన్ కౌన్సులర్ సందర్శనశాలను ఆక్రమించుకున్న వారిలో ఒకరైన జో కెల్లీ ఉద్యోగులతో ఇలా అన్నాడు " ఆసక్తి కలిగిన పెట్టుబడిదారులు ఉన్నంత కాలం కంపెనీ మూతపడదు " . రిసీవర్.

వికీపీడియా ఆర్టికల్ : రిసీవర్ ఇచ్చిన వాగ్మూలంలో : డెలోట్టీ డేవిడ్ కార్సన్ 670 ఉద్యోగులలో 480 మంది ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. ఎదురుచూడని నిర్ణయానికి ఉద్యోగులు ఆగ్రాహానికి గురైయ్యారు. ఆరాత్రి దాదాపు 100 మంది ఉద్యోగులు సందర్శనశాల వద్ద అనధికారిక బైఠాయింపు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉద్యోగులు తాము కార్సన్‌ను కలిసేవరకు వదిలివెళ్ళడానికి నిరాకరిస్తున్నమని సూచించారు. తరువాత అక్కడ జరిగిన చిన్నపాటి ఘర్షణలో సందర్శన కేంద్రం ముఖద్వారం దెబ్బతిన్నది. ఎవరైతే సందర్శనశాలను ఆక్రమించుకున్నారో వారిలో ప్రాంతీయ సిన్ ఫెయిన్ కౌన్సిలర్ జో కెల్లీ ఉన్నాడు"