Jump to content

పుట:PlagiarismHandout.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయసేకరణ (ప్లాగియారిజం) కాపీరైట్ ఉల్లంఘనా ఒకటి కాదు. విషయసేకరణ కాపీరైట్ చేయబడిన రచనల నుండి మరియు ప్రజాసమర్పిత (కామన్ డోమియన్) రచనల ఆధారాల నుండి చేయబడుతుంది. వికీపీడియా మీద ఆరోపించబడిన విషయసేకరణ గురించిన ఆరోపణ గురించిన ఒక నివేదిక " వికీపీడియా సంపాదకులు పలు విషయసేకరిత వ్యాసాలను చేర్చుతున్నారు. అది సరే కాపీ చేయబడిన సమాచారం ప్రజాసమర్పిత సమాచారం నుండి సేకరించబడుతుంది ". వికీపీడియా సంపాదకుల ప్రతిస్పందన వాస్తవమైతే వారు దానిని వివరించడంలో పొరపాటు చేస్తున్నారు. జానే అస్టెన్ ప్రఖ్యాతి చెందిన నవల " ప్రైడ్ అండ్ ప్రీజ్యుడీస్" (1814) ప్రారంభవాఖ్యం " విశ్వజజీనమైన నిజం ఇది. వ్యక్తిగతంగా ఒకరు అదృష్టం స్వంతంసేసుకోవడం భార్యను కోరుకోవడంలోనే ఉంది". ఈ నవలా వాఖ్యం 1911 నాటి ఎంసిక్లోపీడియా బ్రిటానికా ప్రజాసమర్పిత సమాచారంలో చేర్చబడింది. ఇవి ఆస్టెన్ పదాలు. ఎవరికీ దీనిమీద అధికారం లేదన్నది వాస్తవం. అయినప్పటికీ మనం ఆవాఖ్య ఆమెది అని వివరించడం అవసరం. ఈ వాఖ్యని కోటేషన్స్ లేకుండా వ్యాసంలో చేర్చినట్లైతే వికీపీడియా ఆస్టెన్ వాఖ్యని విషయచౌర్యం చేసినట్లే. అదికాకుండా వాక్యనిర్మాణ ప్రయోజనాన్ని ఆమెకు చెందేలా వీకీపీడియన్లు పరిశోధకులలా వాఖ్యకు ఆధారం చూపుతూ రచయిత పేరును పేర్కొనడమే కాక ఆధారగ్రంథం మరియు పుస్తకం పుట సంఖ్యను కూడా తెలియజేయాలి.

వికీపీడియా వ్యాసాలలో విషయచౌర్యం (కాపీరైట్ ఉల్లంఘన) గురించి అధికంగా వివరించబడింది. అయినప్పటికీ విషయసేకరణ (ప్లాగియారిజం) గురించి వివరించలేదు. ఈ అంశం గురించి మార్గదర్శకాల మీద 2008 లో మాత్రమే దృష్టి సారించబడింది. 2005లో వికీపీడియా కో ఫౌండర్ జిమ్మీవేల్స్ ఈ విషయం మీద స్పష్టమైన అభిప్రాయాలు వెలువరించాడు: నన్ను కొంచం స్థిరంగా చెప్పనివ్వండి. చట్టపరమైన వివాదాలు(విషయసేకరణ సంబంధిత) ప్రధానమైనవి. అయినప్పటికీ ధర్మపరమైన వివాదాలు కూడా చాలా చాలా చాలా ప్రధానమైనవి. మనం వికీపీడియా విషయంలో వాటిని ఎదుర్కొనడానికి అవసరమైన శక్తిని సమీకరించుకోవాలి.

"" కామన్ నాలెడ్జ్ మినహాయింపును ఎలా చూడాలి ? "" వికీపీడియాలోని వ్యాసాలలోని అన్ని సమాచారాలకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే సమాచారం కామన్ నాలెడ్జ్ నుండి సేకరించబడుతుందో ... అది సాధారణంగా తెలిపేదేమిటంటే ... వికీపీడియా సంపాదకుడు సమాచారాన్ని ప్రత్యేకమైన ఆధారం నుండి గ్రహించినా దానిని తిరిగి చేర్చడం వివాదాంశమైన విషయసేకరణ కాదు. ఉదాహరణగా: అవి ఎమిలీ డికింసన్ తన జీవితకాలంలో ప్రచురించిన అతి కొన్ని పద్యాలని తెలిసినట్లైతే. అవి పలు ఆధారాలలో లభించినట్లైతే ప్రత్యేకంగా జనరల్ రిఫరెంస్ ఆధారాలలో లభించినవి మరియు సులభంగా సేకరించగలిగినవి అయితే వాటిని కామన్ నాలెడ్జ్‌గా భావించవచ్చు. వాటిని ఒక చలన చిత్రంలోని నటీనటుల అక్షారానుసారా పట్టికవంటి సృజనాత్మకారహిత జాబితాలలోని ఆధారభూతమైన సమాచారంగా తిరిగి అందించడాన్ని అనుమతించవచ్చు. వికీపీడియా పరిశీలనాత్మకత విధానం అలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది. అది సమాచార చౌర్యం కాదని నిరూపించడంలో విఫలతచెందడం సమస్యగా పరిణమిస్తుంది.

కామన్ నాలెడ్జ్ మరియు సృజనాత్మకారహిత మొదలైన సమాచారం మూలాధారాలు కావు. వీటికి సమాచారచౌర్యం అపాదించడం తగదు. తక్కువగా ప్రచారంలో ఉన్న సమాచారం అభిప్రాయాలు సృజనాత్మక సమాచారం తిరిగి అందించడం సమాచారచౌర్యంగా పరిగణించబడుతుంది కనుక దీనిని నివారించాలి. సంపాదకులు వీటిని అందించడంలో కడుజాగరూకత వహించాలి. సృజనాత్మక రచనలోని వాక్యాలను తిరిగి అందించిన సమయంలో వికీసంపాదకునికి దానిమీద సృజనాత్మక హక్కులు ఉండవు. అయినప్పటికీ ఇది కాపీరైట్ ఉల్లంఘన అని నిరూపించడానికి అవకాశం పరిమితం.