పుట:Peddapurasamstanacheritram (1915).pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్తిపోయి, కొండపల్లి రాజమహేంద్రవరదుర్గములను జయించి, యాదేశములను దన ప్రభువురాజ్యములో జేర్పించెనుగాని తరువాత నయ్యనియొక సంవత్సరముకాలములోనేగజపతులకు సామంతులుగా నున్న మండలేశ్వరులవశ మయ్యెను. అంతట రెండు సంవత్సరములు దేశములో క్షామోపద్రవము సంభవించి, వర్షములు లేక పంటలు పండ్క, బావులింకిపోయి, ప్రజలు వలసపోవుట థటస్తహించెను. ఈరెండుసంవత్సరములలోను ద్రిలింగదేశమును, బహమనీరాజ్యమును గూడ వేడిమంగలమునలె వేగు మండుట చేత విత్తనముల చల్లికయే లేకపోయెను. కాని కొంతకాలమునకు భగవదనుగ్రహమువలన వర్షము కురిసి భూమి వ్యవసాయమున కనుకూలముగ నున్నను, వ్యవసాయము చేయుజనుల సంఖ్య మిక్కిలి తక్కువై యుండెను. ఇట్ట్లుండ గొండపల్లిదుర్గములో నున్న తెనుగుసైన్యము తిరుగబడి దుర్గాధ్యక్షుడగు మహమ్మదీయప్రభువును సంహరించిరనియు, ఏతద్దుర్గమును వశపరచుకొన్న యొరిస్సాగజపతుల సేనానులలో నొకడగుభీమరాజు దేశమంతయు క్షామభూయిష్ఠమైయుండుతట చేత బహమనీరాజుల