పుట:Peddapurasamstanacheritram (1915).pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఖ్వాజామహమ్మదుగవానును రాజమహేంద్రవరమున నిలిపి, ఉత్కలదేశకుపై దండెత్తిపోయి, దేశమును బాడుచేసియు, ప్రజలను జూరగొనియు, దృప్తిగనజాలక, గజపతిని సింహాసనబ్రష్ఠున్ని గావించి, గజపతిరాష్ఠ్రమునంతయు శాశ్వతముగ దనరాష్త్రములో జేర్పవలయు నని నిశ్చయించి,తనకొడుకును, మంత్రిని రాజమహేంద్రవరమునుండి రప్పించెను. కాని బుద్దిశాలి యగుగజపతి సమర్ధులచే రాయబారము నడిపించి, కొంతధన మాతనికి సమర్పించి, తురుస్కులు మరలిపోవునటుల జేసెను. ఆధనముతో మహమ్మదుషా తృప్తి బొందనందున ప్రాణసమానముగా జూచుకొను చున్నరురువదియైదు యుద్ధగజములనుగూడ సమర్పించెను. అంతట మహమ్మదుషా మరలి కొండపల్లివరకు వచ్చి, రోషావేసపరవశుడై కొండపల్లి దుర్గమును ముట్టడించెను. కానీ యారుమాసములవర కాదుర్గము స్వాధీనము కాకపోయెను. ఆహారపదార్ధములు తక్కువయగుటచేతభీమరాజు దుర్గములో నిలువజాలక లోబడి, దుర్గమును తురుష్కులవశము చేసెను మహమ్మదుషా తనకింత కాలమువరకు దుర్గము వశము కానందుకు మండిపడుచు, మతాబినివేశపరుడై యచటి దేవాలయములలో నొకదానినిబ్రవేశించి, తనచేతిఖడ్గముతో బ్రాహ్మణ పూజారులను గొందరిని నరికి