పుట:Paul History Book cropped.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నారు. స్త్రీలు పురుషులు వున్నారు. ఇన్ని వ్యత్యాసాలు వున్నా జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో ఐక్యంగావడం వలన నరులంతా సరిసమానం ఔతారు. యూదులమైనా అన్యులమైనా స్వతంత్రుల మైనా మనమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం -1 కొరి 12,13. ఐనా ఒక్కొక్కడు దేవుడు తనకు నియమిచిన అంతస్తులో వుండి పోవాలనేది పౌలుసూత్రం -1 కొరి 7,17.

పౌలుకి ఓ వైపు క్రైస్తవసమాజమూ దాని ఆశయాలూ తెలుసు. మరోవైపు లౌకిక సమాజమూ, అనగా రోమను ప్రభుత్వమూ దాని ఆశయాలు తెలుసు. ప్రభుత్వం ఆశయాలు క్రీస్తు ఆశయాలు కావు. ఐతే క్రైస్తవులు పరలోక పౌరులైనా రోమను ప్రభుత్వానికి లొంగివుండాలని పౌలు కోరాడు. అతడు తన భావాలను రోమా 13,1-7 లో తెలియజేసాడు.

ప్రతివ్యక్తి ప్రభుత్వాధికారులకు లోపడివుండాలి -13,1. ఎందుకు? పౌలు మూడు కారణాలు చూపాడు. 1. ప్రభుత్వాధికారం దేవుని నుండే వస్తుంది. కనుక అధికారులను ధిక్కరించేవాళ్లు దేవుని దండనకు గురౌతారు -13,2, 2. ఇంకా అధికారులు దుషులను శిక్షించి సజ్జనులను రక్షిస్తారు. వాళ్లు చేసేది మంచిపనే. అందుచేత మన అంతరాత్మ మనం ప్రభుత్వఅధికారులకు లొంగివుండాలని చెప్పంది -13,5. 3. పైగా అధికారులు సమష్టి శ్రేయస్సుకొరకు కృషి చేస్తారు. కనుక మనం వారికివిధేయులంగావాలి. ఇందుకే క్రైస్తవులు కూడ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. అధికారులను గౌరవించాలి కూడ -13,7.

పౌలు రోమను ప్రభుత్వం ఎప్పడూ ధర్మయుక్తంగానే పరిపాలిస్తుంది అనుకొన్నాడు. కాని ఆలా జరగలేదు. అతడు