పుట:Paul History Book cropped.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విధేయులుగా వుండండి. ఇది దేవునికి ప్రీతి కలిగిస్తుంది" -కోలో 3,20. ఇది పదియాజ్ఞల్లోని నాల్గవ ఆజ్ఞ. పిల్లలకు తల్లిదండ్రులను విుంచిన ఆవ్న లెవరూ లేరు. కనుక వారి పట్ల గౌరవం విధేయు తచూపాలి. ఇక తల్లిదండ్రులు పిల్లల కు కోపం రప్పించకూడదు. దానివలన పిల్లలకు నిరుత్సాహం కలుగుతుంది -కొలో 3,21. అమ్మానాన్నలు తప్పకుండ వారి పిల్లలను ప్రేమిస్తారు. ఐతే వారిని క్రైస్తవధర్మంలో పెంచాలికూడ. పెద్దలు పిల్లలను నియంతలాగ శాసించకూడదు. దానివలన పిల్లల్లో పిరికితనం ఏర్పడుతుంది. వాళు క్రుంగిపోతారు. పెద్దలు ఎప్పడూ ప్రోత్సాహకు లుగా మెలగాలి.

2. బ్రహ్మచర్యాన్ని గూర్చిన పౌలు భావాలు ఇవి. ఈయంశంమిద పౌలు వెలిబుచ్చిన భావాలు అతనివి, క్రీస్తువి కావు -1 కొరి 7,25. అందరూ తనలాగే వుండాలని పౌలు కోర్కె -1 కొరి 77. బహుశః ఇక్కడ "తనలాగే" అంటే అవివాహితులుగా అని భావం కావచ్చు. ఆలాయెందుకుండాలంటే రెండవరాకడ త్వరలోనే వస్తుంది కనుకనూ, లౌకికమైన శ్రమల నుండి తప్పించుకోవచ్చు కనుకనూ 7.26-29. ఇంకా అవివాహితులు తమహృదయాలను పుర్తిగా దేవునికే సమర్పించుకోవచ్చు కనుక -7,32-35.

3. విధవలు మరల వివాహం చేసికోవచ్చు. కానివాళ్లు ෂධී అంతస్తులో వుండిపోవడం మెరుగు -7,8. రెండవరాకడ త్వరలో రానుంది కనుకనూ, లౌకిక శ్రమలను తప్పించుకోవచ్చు కనుకనూ పౌలు ఈ సూచన చేసాడు.

5. సమాజ ధర్మాలు

పౌలు ఆనాటిసమాజంలోని వ్యత్యాసాలను గుర్తించాడు. సమాజంలో యూదులు గ్రీకులు వున్నారు. స్వతంత్రులు బానిసలు