పుట:Paul History Book cropped.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెల్లవు. ఇది ప్రభువు ఆజ్ఞ-7,10-11. క్రైస్తవులు క్రైస్తవేతరులను పెండ్లిచేసికొన్నపుడు అవసరమైతే విడాకులు తీసికోవచ్చు -7,15. దీనికే పౌలు గారి అనుమతి అని పేరు.

భార్యకు శిరస్సు (అధికారి) భర్త -1 కొరి 11,3. అనగా భార్య పెనిమిటి చెప్పచేతల్లో వుండాలి. ఆకాలపు సమాజంలోని స్త్రీల పరిస్థితిని పురస్కరించుకొని పౌలు ఈలా వ్రాసివుండవచ్చు.

ఎఫెసీయుల జాబు పౌలు శిష్యుడు వ్రాసింది. ఆజాబు 5,21-33లో రచయిత వివాహధర్మాలను విపులంగా పేర్కొన్నాడు. భార్య భర్తకు విధేయురాలై వుండాలి -5,22. భర్త భార్యను ప్రేమించాలి -5,25. ఇవి కూడ రచయిత తననాటి సమాజంలోని పరిస్థితులను బట్టి చేసిన సూచనలు అనుకోవాలి. పురుషుని కంటె స్త్రీ తక్కువది అని పౌలు భావం కాకపోవచ్చు. భర్త ప్రేమకు ఆదర్శం క్రీస్తుకి తిరుసభ పట్ల వుండే ప్రేమే -5,25. భార్యాభర్తల ఐక్యత క్రీస్తుకి తిరుసభకు వుండే ఐక్యతలాంటిది అనే భావం చాల ఉన్నత మైంది. నేటి మనకైస్తవివాహానికి విలువనూ వరప్రసాదాన్నీ ఇచ్చేది ఈ పోలికే-5,22.

పూర్వవేదంలో యూవే ప్రభువు భర్త, యిప్రాయేలు ప్రజలు భార్య అనే భావం వుంది. నూత్నవేదంలో క్రీస్తు వరుడు, తిరుసభ వధువు ఔతారు. మన జ్ఞానవివాహంలో ఈ పోలిక వధూవరుల విూద సోకి వారిని పవిత్రులను చేస్తుంది.

దంపతులను గూర్చిన పౌలు ముఖ్యభావం গু3ে. దంపతులు కొన్నిసార్లు శారీరకమైన కలయికను మానుకొని ఆ కాలాన్ని ప్రార్థనకు ఉపయోగించడం మంచిది -15°రి 7,5.

పౌలు తల్లిదండ్రులకూ బిడ్డలకూ వుండవలసిన సంబంధాన్ని గూడ వివరించాడు. 'బిడ్డలారా! విూరు తల్లిదండ్రులకు