పుట:Paul History Book cropped.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పౌలు ప్రేషిత సేవలో తాను అనుభవించిన శ్రమలద్వారా క్రీస్తు శ్రమల్లోని కొరతనుతీరుస్తున్నాడు - కోలో 124. యథార్థంగా క్రీసు శ్రమల్లో కొరతయేవిూలేదు. తిరుసభ తరపున మాత్రం కొరతవుంది. అతడు తనవంతు శ్రమలను తాను అనుభవించి తిరుసభలోని కొరతను తీరుస్తున్నాడు. పౌలుక్రీస్తుతో ఐక్యమయ్యాడు కనుక క్రీస్తు శ్రమల్లో తానూ పాలుపొందాలని తండ్రి నిర్ణయించాడు. అతని శ్రమలు తిరుసభకు ఉపయోగ పడతాయి. కనుక అతడు ఎల్లపుడు తన భౌతిక శరీరంలో క్రీస్తు సిలువ మరణాన్ని మోసాడు - 2 కొరి 4,10. తన శరీరంలో యేసు ముద్రలు ధరించాడు -గల 6, 17. ఈ ముద్రలు అతని శ్రవులే - గల 6, 17. తాను ఇదివరకేసాధించిన ప్రాతకార్యాలను మరచిపోయి ముందున్నదానిని చేరడానికి తీవ్రంగా కృషిచేసున్నాడు. వెూక్ష బహుమతిని గెల్చుకోవడానికి తన ధ్యేయంవైపు సూటిగా పరుగెత్తు తున్నాడు - ఫిలి 3, 13-14.

4. కుటుంబ ధర్మాలు

పౌలు వివాహం, బ్రహ్మచర్యం, వైధవ్యం మొదలైన అంతస్తులనుగూర్చి -1కొరి 7లో సలహాలు ఇచ్చాడు. అతని ప్రధానసూత్రం ఇది. ప్రతివాడు దేవుడు తన కిచ్చిన వరాన్నిబట్టి తానున్న అంతస్తులో వుండిపోవాలి - 1కొరి 7,17.

1. వివాహ జీవితాన్ని గూర్చి అతనిభావాలు ఇవి. వివాహం బ్రహ్మచర్యం గూడ దేవుడిచ్చే వరాలు. క్రైస్తవులకు ఒకే భార్య ఒకే భర్త వుండాలి. జారత్వం ప్రచురంగా వుందికనుకను, కామంవలన కాలిపోవడం కంటె పెండ్లియాడ్డం మంచిది కనుకను వివాహ వ్యవస్థ చేపట్టదగింది -1కొరి 7,2.9.దంపతులు ఒకిరినొకరు పవిత్రపరచు కోవాలి. ఇద్దరూ కలసి బిడ్డలను పవిత్రపరచుకొంటారు. విడాకులు