పుట:Paul History Book cropped.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సువార్తను బోధించడం ద్వారా యాజకుడు అయ్యాడు. అతడు దేవునికి సమర్పించే అర్పణం అన్యజాతి ప్రజలే -రోమా 15,16-17.

3. ఇంద్రియ నిగ్రహం

పౌలు అడుగడుగున ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాడు. బోధకుల బోధలకు గాను విశ్వాసులే వారిని పోషించాలి. ఇది బోధకుల హక్కు కాని పౌలు ఈ హక్కును వదలుకొని ఉచితంగానే బోధన సేవ చేసాడు - 1 కొరి 9,12. ఇది అతని త్యాగానికి నిదర్శనం.

అతడు స్వతంత్రుడై కూడ దాసుళాగ మెలిగాడు. యూదులతో పనిజేసేపుడు యూదుల్లాగ, గ్రీకు ప్రజలతో పని జేసేపుడు గ్రీకునరుళాగ ప్రవర్తించాడు. కొందరినైన రక్షించడానికి అందరిపట్ల అన్ని విధాలుగ మారాడు. ఈలా ఎల్లరిమనస్తత్వాలకు తగినటుగా మారాలంటే అతడు తన వ్యక్తిత్వాన్ని త్యజించుకొని వుండాలి. ఈ త్యాగం అతనికి బాధ కలిగించి వుండాలి -1 కొరి 9,19–22.

పౌలు తన్ను పందెంలో పాల్గొనే క్రీడాకారునితో పోల్చుకొన్నాడు. వాళ్లు అశాశ్వతమైన కిరీటాన్ని సంపాదించడానికి ఎన్నో శ్రమలు పడతారు. నిద్రాహారాలు మానతారు. తమ శరీరాన్ని నలగగొటుకొని అదుపులోకి తెచ్చుకొంటారు. ఎన్నోరోజులు అభ్యాసం చేస్తారు. కాని పౌలు శాశ్వత కిరీటాన్ని పొందడానికి కృషిచేస్తున్నాడు. అదే మోక్షబహుమానం. కనుకతాను ఓ క్రీడా కారుళాగ పరుగెత్తుతున్నాడు. గమ్యంవైపు పరుగుతీస్తున్నాడు. ముష్టియుద్ధంజేసే క్రీడాకారులు ఒకరి శరీరంపై ఒకరు దెబ్బలు కొట్టుకొంటారు. కాని పౌలు తన శరీరాన్ని తానే నలగగొటుకొని అదుపులోకి తెచ్చుకొంటున్నాడు. మోక్షబహుమతి కొరకు నానా శ్రమలు అనుభవిస్తున్నాడు - 199,24-27.