పుట:Paul History Book cropped.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గతించాక అదే ప్రభుత్వం క్రైస్తవులను క్రూరంగా హింసించింది. కనుక పౌలు బోధించిన సమాజ ధర్మాలు ఇప్పడు మన కాలానికి సరిపోవు.

పౌలు బానిసలు బానిసలుగానే వుండాలని చెప్పాడు. "దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసవా? విచారించకు" 1 కొరి 7,21. పైగా వారిని "దాసులారా! దేవునియందు భక్తికలిగి ఎప్పడూ మి యజమానుల ఆదేశాలను చిత్తశుద్ధితో పాటించండి" అని బోధించాడు - కొలో 3,22. అందుకే తన్నాశ్రయించిన ఒనేసిము అనే బానిసను తిరిగి యజమానుని వద్దకు పంపించాడు. అనగా అతడు బానిసగానే వుండిపోవాలని పౌలు ఉద్దేశం. కాని అతన్ని సోదరునిగా చూచుకొమ్మని మాత్రం ఆ యజమానునికి హితబోధ చేసాడు -ఫిలేమోను 1,16. పౌలుకి ఆనాటి సమాజాన్ని మార్చాలన్న కోరిక యేమిరాలేదు. అతడు సంఘసంస్కర్త కాదు. ఎవరి అంతస్తులో వాళ్లు ఉండాలన్నదే అతని సూత్రం.

కాని అతడు క్రీస్తు బోధలు, క్రైస్తవజీవితం క్రమేణ రోమను సమాజాన్ని మార్చి వేస్తాయని నమ్మాడు. క్రైస్తవమతం పాలలోవేసిన తోడు లాగ నవూజాన్ని మారుసుందనీ, వునం తొందర పడనక్కరలేదనీ అతని తలంపు. క్రీస్తు దేవుని రూపం. నరులు కూడ ఈ క్రీస్తు రూపాన్ని పొందాలి. భువినుండి పుట్టినవానిని పోలివున్న మనం దివినుండి వచ్చినవానిని అనగా క్రీస్తుని పోలివుండాలి. నరుల్లో ఈవూర్పు క్రమేణ వచ్చి ప్రజల్లోని అంతరాలు నశించిపోయి సమసమాజం ఏర్పాడుతుందని పౌలు ఆశించాడు. మొత్తం విూద సమాజాన్ని గూర్చిన అతని నీతిబోధలు ఈ కాలానికి సరిపోవు. ఆనాడు అతడు ఊహించని మార్పులు ఇప్పడు ఎన్నో వచ్చాయి.