పుట:Paul History Book cropped.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
11. అంత్యగతులు 1. సూతయుగం ప్రారంభమైంది


పౌలు మొదట క్రీస్తు రెండవరాకడ తన జీవితకాలంలోనే జరుగుతుంది అనుకొన్నాడు. కనుక దేవదూతల బాకాలు విన్పిస్తాయి. క్రీస్తు మేఘాలమిద యొక్కి వస్తాడు అని వ్రాసాడు -1 తెస్తు 4, 6. కాని అతని జీవితాంతం వరకు రెండవ రాకడ జరగలేదు. కనుక అతడు చివరి కాలంలో తన భావాలను కొలదిగా వూర్చుకొన్నాడు. విశ్వానుల కు వెూక్షజీవితం ఇక్కడే ప్రారంభమౌతుంది కనుక వాళ్లు క్రీస్తుపై మనసుపెట్టి జీవించాలని బోధించాడు. ఈయంశాన్ని కొంచెం విపులంగా పరిశీలిద్దాం. క్రీసు ఉత్థానంతోనే నూత్నయుగం ప్రారంభమైంది. ఉత్థానక్రీస్తు తండ్రికుడిపార్వాన ఆసీనుడై తిరుసభనూ లోకాన్నీ కూడ పరిపాలిస్తుంటాడు. కాని అతని రాజ్యాధికారం కంటికి కన్పించేది కాదు. క్రీస్తుతో పాటు క్రైస్తవులు కూడ మోక్షవారసత్వాన్ని పొందుతారు. ఈలోకంలో వుండగానే తండ్రి వారిని చీకటినుండి అద్భుతమైన వెలుగులోకి పిల్చాడు. దేవుడు వారిని నీతిమంతులను చేసాడు. ఇక వాళ్లు తీర్పుకి భయపడనక్కరలేదు. ఇక్కడ వుండగానే పవిత్రాత్మ వారికి సంచకరువుగా లభిస్తుంది. వాళ్లు ఎప్పడు కూడ భయభక్తులతో తమ రక్షణకార్యాన్ని కొనసాగించుకొని పోవలసిందే పిశాచశక్తులతో పోరాడ వలసిందే. కాని వాళ్లు ఉత్థాన క్రీస్తుతో ఐక్యమై ఆత్మశక్తి వలన ఈ లోకంలో శాంతి సమాధానాలతో జీవిస్తారు. ఇప్పడు వాళు క్రీను స్థాపించిన దైవరాజ్యంలో అంత్యకాలంలో వున్నారు. ఇదే నూత్నయుగం.