పుట:Paul History Book cropped.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విననందున అన్యజాతి ప్రజల దగ్గరికి వెళ్లాడు. మరి వారికి రక్షణం లభిస్తుందా? కట్టకడన దేవుడు యిప్రాయేలును రక్షిస్తాడని అతడు గట్టిగా నవ్మూడు - రోమా 11,26. వారి నుండే రక్షణం ప్రారంభమైంది. మెస్సీయా వారి నుండే పుట్టాడు. కడన రక్షణం వారితోనే ముగుస్తుంది. తాను స్వయంగా ఎన్నుకొని దీవించిన వారి విషయంలో దేవుడు మనసుమార్చుకోడు - రోమా 11,29.


7. పౌలు తానుయుగాంతంలో వున్నాననీ, దేవుడు సువార్త బోధను తనకు ఒప్పజెప్పాడనీ రూఢిగా నమ్మాడు. క్రీస్తుద్వారానే రక్షణమనీ, దేవునికీ నరునికీ నడుమ మధ్యవర్తి యేసు ఒక్కడేననీ గట్టిగా విశ్వసించాడు - 1 తిమో 2,5. కనుక క్రీస్తుని బోధించకపోతే తనకు పుట్పుగతులు వుండవని భావించాడు -1 కొరి 9,16. ఈ ప్రేరణంతోనే అతడు వేదబోధ చేసాడు. శ్రమలు అనుభవించాడు -అచ20,24.

8. పౌలుకి సాంఘిక స్పూర్తి వుంది. అతడు ఆనాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులను పట్టించుకొన్నాడు. గ్రీకు క్రైస్తవుల నుండి విరాళాలు ప్రోగు జేసి యెరూషలేములోని కరువు బాధితులకు పంపాడు -2 కొరి 9,13. క్రైస్తవుల్లో జాతి, వర్గ, లింగ భేదాలు వుండకూడదని బోధించాడు - గల 3.28. ఒనేసిము అనే బానిసకు యజమానునుండి స్వాతంత్ర్యం ఇప్పించాడు. స్త్రీలనుగూడ తన ప్రేషితబృందంలో చేర్చుకొన్నాడు.

9. పౌలుకి ప్రార్థన అతిముఖ్యమైంది. ప్రార్థన చేసేవాళ్లంతా రక్షణాన్ని పొందుతారు అనేది అతని సూత్రం -రోమా 10,13. ఆత్మ మనచే ప్రార్థన చేయిస్తుందని స్పష్టంగా చెప్పాడు -రోమా 8,26-27. అపోస్తుల చర్యల పుస్తకంలో లూకా పౌలుని నానాసందర్భాల్లో ప్రార్ధనచేసున్నట్లుగా చిత్రించాడు. ఆచ 20,36. పౌలుకూడ