పుట:Paul History Book cropped.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలంలో మదర్ తెరెసా ప్రేమతో గూడిన సేవకు మంచి నిదర్శనం. ఆమెలా జీవిస్తే మనం పౌలు బోధలను పాటించినట్లే.

9.పౌలు ప్రేషిత సేవ

పౌలు భక్తుడు మహాప్రేషితుడు. అతని ప్రేషిత సేవ నేడు మనకు కూడ ప్రేరణం పుట్టిస్తుంది. ఇక్కడ అతని సేవలోని ముఖ్యాంశాలను కొన్నిటిని పరిశీలిద్దాం. 1. ప్రేషిత సేవ నరునినుండి కాక దేవుని నుండి వస్తుంది. పౌలుని వేదజోధకు పిల్చింది దేవుడు - గల 1,15. అతనికి శక్తి నొసగి అతనిచే వేదబోధ చేయించింది దేవుడు. ప్రభువు తన్ను వేదబోధ చేయమని ఆజ్ఞపించాడనీ, కనుకనే తానా పనిని చేస్తున్నాననీ పౌలు గాఢంగా నమ్మాడు.

2. తొలిరోజుల్లో సువార్త అంటే పుస్తకం గాదు, బోధ. క్రీస్తు వురణోత్తానాలను వాక్కుతో బోధించడం. ఈ సువార్తలోనే అద్భుతమైన శక్తివుంది - రోమా 1,16. దేవుడు బోధకుణ్ణి పంపుతాడు. అతడు సువార్తను బోధిస్తాడు. ఆ బోధ విని నరులు క్రీస్తుని విశ్వసిస్తారు - రోమా 10,14-17. పౌలు వక్తృత్వకళను ఆశ్రయించలేదు. సువార్తలోని శక్తి మిరాదనే ఆధారపడ్డాడు. అదే అతనికి విజయాన్ని చేకూర్చిపెట్టింది. బోధకుని నోటినుండి వచ్చే దేవుని వాక్కులోనే బ్రహ్మాండమైన శక్తి వుంటుంది. శ్రోతల హృదయాలను కదిలించేది ෂධී.

3. పౌలు నోటితోనేగాక అద్భుతాల ద్వారా కూడ బోధించాడు. అతడు చాల అద్భుతాలు చేసాడు - రోమా 15,18-19. కాని అతడు చేసిన గొప్ప అద్భుతం క్రీసుకొరకు శ్రమలు