పుట:Paul History Book cropped.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన బాహిర నియమాలు క్రీస్తు బోధలు మాత్రమేకాదు. పౌలు జీవితమూ బోధలూకూడ మన బాహిర నియమాల్లోకి వస్తాయి. కనుకనే అతడు ఫిలిప్పీయులకు వ్రాసూ మిరారందరు నన్ను అనుసరించండి అని చెప్పాడు -3,17. కొరింతీయులకు వ్రాస్తూ మినారు క్రీస్తుని అనుసరించినట్లే నన్ను కూడ అనుసరించండి అని ఆదేశించాడు -1 కొరి 11,1.

స్వేచ్చ సేవలు చేయడానికి

క్రైస్తవునికి స్వేచ్ఛవుందంటే అతడు విచ్చల విడిగా తిరగ వచ్చని కాదు. స్వార్థంతోను వ్యామోహాలతోను జీవించవచ్చని అర్థం కాదు. అతన్ని నడిపించేది పవిత్రాత్మ అతడు నడిచేది చీకటిలో కాదు, వెలుగులో, అతడు క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది అపర క్రీస్తుగా తయారౌతాడు. అతనిలో క్రీస్తు వసిస్తున్నాడు కనుక అతని క్రియలు కూడ క్రీస్తు క్రియలు కావాలి. ఆ ప్రభువు నేను సేవలు చేయడానికి వచ్చానుగాని సేవలు చేయించుకోవడానికి రాలేదు అన్నాడు - మత్త 20,28. కనుక ఆ క్రీస్తుని అనుసరించి క్రైస్తవుడు కూడ తోడివారికి సేవలు చేయాలి. స్వతంత్రులుగా వుండడానికి దేవుడు మిమ్ము పిల్చాడు. కాని ఈ స్వేచ్ఛ విూరు శారీరక వ్యామోహాలకు లొంగిపోవడానికి కాదు. ఒకరి కొకరు ప్రేమతో సేవలు చేయండి -గల 5,13. కనుక స్వేచ్ఛకుఫలితం ప్రేమతో గూడిన సేవ. ఆత్మ మనకు దయచేసే వరాలన్నిటిలోను శ్రేష్టమైంది ఈ ప్రేమ -1 కొరి 13, 13. ఈ ప్రేమ వల్లనే పౌలు ఎవరివద్దకు పోయినపుడు వారికి అనుకూలంగా మెలిగేవాడు. నేను కొందరినైన రక్షించడానికి అందరికొరకు అన్నివిధాలుగా తయారయ్యాను -1 కొరి 9,22. ఈ సందర్భంలో వున స్వేచ్ఛను మన వేులా వినియోగించు కొంటున్నానూ అని పరిశీలించి చూచుకోవాలి. మన