పుట:Paul History Book cropped.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మశాస్ర జ్ఞానం వల్ల ఇది పాపకార్యమని తెలిసికొంటాం. బలహీనతవల్ల ఆ పాపకార్యాన్ని చేస్తాం. ఈ విధంగా יסכc పాపాలసంఖ్య పెరిగిపోతుంది. పాపాలు అధికం గావడానికే ధర్మశాస్త్రం వచ్చింది - రోమా 5,20. గల 3,19. ఈలాగైతే ధర్మశాస్తాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? మోషే ధర్మశాస్రం పాపాలకు కారణమవొతుందని దేవునికి ముందుగానే తెలుసు. ఐనా అతడు దాన్ని అనుమతించాడు. ఎందుకు? పాపం ఎక్కడ పెరిగిందో అక్కడే దేవుని అనుగ్రహంకూడ ఇంకా అధికంగా పెరగడానికి. పాపం వల్ల నాశమయ్యే నరులను దేవుడు క్రీస్తుద్వారా శాశ్వత జీవానికి కొనిపోవడానికి - రోమా 5.20-21. ఇది లోతైన భావం. యూదమతాభిమానులు తలంచినటుగా ధర్మశాస్రం మనలను రక్షించదు. దానివల్ల మన దౌర్భగ్యం తొలగిపోదు. మన ప్రభువైన క్రీస్తుద్వారానే మనకు ఉద్ధరణం లభిస్తుంది. అతని మరణోత్థానాలు ఆ ప్రభువుపట్ల విశ్వాసం మనకు పాపపరిహారాన్ని ఆర్జించి పెడతాయి - రోమా 7,24-25.

ఈ సందర్భంలో పౌలు క్రీస్తు ధర్మశాస్తానికి అంతం అన్నాడు - రోమా 10,4. ఇది గొప్ప వాక్యం. ఇక్కడ అంతం అంటే ముగింపనీ, ఫలితమనీ రెండర్గాలు వున్నాయి. ఇక్కడ మనకు రెండవ అర్ధం ముఖ్యం. అనగా ధర్మశాస్త్రం వల్ల యూదులు o వరప్రసాదాన్ని ఏ ఫలితాన్ని పొందగోరారో అది యిప్పడు క్రీస్తు ద్వారా మనకు లభించిందని భావం. ఇంకా చెప్పాలంటే యూదులు ధర్మశాస్రంద్వారా పొందగోరిన ఫలితాన్ని కడన మనం క్రీస్తుద్వారా పొందామని భావం.

కనుక యూదులు మేము ధర్మశాస్తాన్ని పాటిస్తున్నాం గనుక దానివల్లనే నీతిమంతుల మౌతాం అని గొప్పలు చెప్పకోగూడదు. దాన్ని పాటించడం వలన ఏ నష్ట్రపని దృష్టిలో నీతిమంతుడు