పుట:Paul History Book cropped.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
3. పౌలు బోధ

గ్రీకు రోమను ప్రజలు కూడ ధర్మశాస్తాన్ని పాటించాలనీ సున్నతిని పొందాలనీ లేకపోతే వారికి రక్షణం లేదనీ యూద మతాభిమానులు వాదించారు. పౌలు ఈ వాదాన్ని ఖండించాడు. ధర్మశాస్రం ప్రాముఖ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూచి తన భావాలను ఈ క్రింది రీతిగా తెలియజేసాడు.

ధర్మశాస్రం దానంతట అది మంచిదే. దేవుడే యిచ్చాడు గాన అది పవిత్రమైంది, ఉత్తమమైంది -రోమా 7, 12. ధర్మశాస్రం, నిబంధనం, వాగ్దానాలు యూదులకున్న ప్రత్యేక సదుపాయాలు. ఆ సదుపాయాలు అన్యజాతులకు లేవు - 9,4. ఐనా ధర్మశాస్త్రం నరులు పాపంలో పడ్డానికి కారణమైంది. ఏలాగ?

ధర్మశాస్త్రం పలానా కార్యం పాపమని తెలియజేస్తుందేకాని ఆ పాపకార్యాన్ని వారించే వరప్రసాదాన్ని మాత్రం నరులకు ఈయలేదు. దానివల్ల పాపజ్ఞానం కలుగుతుంది. కాని ఆ పాపంలో పడిపోవడానికి కూడ అదే అవకాశం కల్పిస్తుంది - రోమూ 3,20, ధర్మశాస్త్రమే లేకపోతే నరులకు పాపజ్ఞానం కలిగేది కాదు. వాళ్లు పాపం చేసినా అది పాపమయ్యేది కాదు. ధర్మశాస్త్రం పలానా పని పాపమని తెలియజేస్తుంది. ఆ కార్యాన్ని చేయడం ద్వారా మనలను పాపంలో కూలద్రోస్తుంది -7,7-8. అందుచే దానిద్వారా నరుల పాపాలు పెరిగిపోయాయి. ఆజ్ఞలు పాపాలను పెంచివేసాయి -7,13. ఇంకా ధర్మశాస్రం నరులను శాపగ్రస్తులను చేసింది - గల 3,10. యూదమతాభిమానులు మేము ధర్మశాస్తాన్ని పాటించడం ద్వారా, ఆజ్ఞలను అనుసరించి పుణ్యకార్యాలు చేయడం ద్వారా నీతిమంతులం అయ్యాం అనుకొన్నారు. ఆలాగైతే వాళ్లనువాళ్లే నీతిమంతులను చేసికొన్నట్లు ఔతుంది - రోమా 3,27.