పుట:Paul History Book cropped.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాడు - రోమా 3,19-20. మనలను నీతిమంతులను జేసేది క్రీస్తుపట్ల విశ్వాసం ఒక్కటే.


దేవుడే నరులకు ధర్మశాస్తాన్ని ఇచ్చాడు. ఐనా నరులు దానివల్ల నీతిమంతులు కావడం లేదు. ఆలాంటప్పుడు దేవునికృషి వ్యర్థమైపోలేదా? ధర్మశాస్రం దేవుని ప్రయత్నాన్ని వ్యర్థం చేయదు. సఫలీకృతమే చేస్తుంది. ఏలాగంటే క్రీస్తు వచ్చిందాకా ధర్మశాస్రం మనకు బాలశిక్షకుడుగా పని చేసింది. పౌలు నాడు గ్రీకు సమాజాల్లో సంపన్నుల పిల్లలను వారి బానిస బడికి తీసికొని పోయేవాడు. ఆ పిల్లల చదువును పర్యవేక్షించేవాడు. అతడే బాలశిక్షకుడు. అనగా క్రీస్తువచ్చిందాకా ధర్మశాస్రం మనకు సహాయకారిగా వుందని భావం. అతడు వచ్చాక అది తొలిగిపోయింది. అనగా దానిప్రయోజనం శాశ్వతమైంది కాదు, తాత్కాలికమైంది మాత్రమే - గల3,23-24. మనలను రక్షించేది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే - రోమా 7,24.

పౌలు దృష్టిలో శరీరం పాపాల్గాగే ధర్మశాస్రంగూడ ఓ క్రూర నియంత లాంటిది. అది నరులను హింసించడానికే వుంది. శరీరం, పాపం దానికి ఊతమిచ్చి మనం కూలిపోయేలా చేస్తాయి. నరులకు మంచి యేదో తెలుసు. ఐనా చెడ్డనే చేస్తున్నారు. వారిలోని శరీరం, పాపం వారిని చెడ్డను చేయడానికి ప్రేరేపిస్తున్నాయి - రోమా 7,14-17. ఫలితాంశం ఏమిటంటే, ధర్మశాస్రంగాదు, క్రీస్తుపట్ల విశ్వాసం మనలను రక్షిస్తుంది.

4. మృత్యువు

శరీరమూ ధర్మశాస్త్రమూ పాపాన్ని బలపరుస్తాయి. పాపంవల్ల నరుడు దేవునికి దూరమైపోతాడు. అతనికి శత్రువెతాడు - రోమా 5, 8-10. పాపం ద్వారా మృత్యువు సిద్ధిస్తుంది. పౌలు