పుట:Paul History Book cropped.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీనాయి నిబంధనం ద్వారా ప్రభువు యిస్రాయేులు ప్రజలందరితోను నిబంధనం చేసికొన్నాడు. దానివలన ప్రజలందరికి పరస్పర సంబంధం ఏర్పడింది. కనుక ఆ ప్రజలు ఒకరినొకరు అంగీకరించాలి. అందరూ కలిసి దేవుణ్ణి ప్రేమించాలి. కనుక దైవప్రేమ సోదరప్రేమ అనే రెండా జ్ఞలు ధర్మశాస్రంలో కెల్ల ప్రధానమైన ఆజ్ఞలయ్యాయి.


దేవుడు ధర్మశాస్తాన్ని రాతిపలకలపై వ్రాసియిచ్చాడు. దానిలోని ఆజ్ఞలు నరుల హృదయాలకు వెలుపల వున్నాయి. కనుక ప్రజలు వాటిని మక్కువతో పాటించకపోవచ్చు. ప్రవక్త యిర్మీయా నూత్న నిబంధనకాలం వస్తుందనీ, అప్పడు ప్రభువు తన ఆజ్ఞలను నరుల హృదయాల విూదనే వ్రాస్తాడనీ, ఆ విూదట వాటిని పాటించడం తేలికౌతుందనీ వా కొన్నాడు -31,33. ఆలాగే యెహెజ్కేలు ప్రవక్త ప్రభువు ప్రజలకు నూత్న హృదయూన్ని దయచేస్తాడనీ, అందుచే ప్రజలు ధర్మశాస్తాన్ని శ్రద్ధతో పాటిస్తారనీ వాకొన్నాడు-36,26-27. ఈ రెండు ప్రవచనాలు నూత్న వేదంలో క్రీస్తువచ్చినపుడు నెరవేరాయి. అనగా నూత్నవేద కాలంలో ధర్మశాస్త్రం నరులకు ఆంతరంగికమైన శక్తి ఔతుందని భావం. ఫలితార్థం ఏమిటంటే యూదులు ధర్మశాస్తాన్ని పాటించడం వలన రక్షణం పొందరు. ప్రభువు వాళ్లను దాస్యం నుండి విడిపించాడు కనుక వాళు కృతజ్ఞతా పూర్వకంగా ధర్మశాస్తాన్ని పాటించాలి. అది ప్రధానంగా రక్షణను ఇచ్చేది కాదు. రక్షణకు పర్యవసానం మాత్రమే. రక్షణకు కృతజ్ఞతను తెలియజేసేది, అంతే.

2. కాలక్రమేణ వచ్చిన మార్పు

కాలంగడిచే కొద్ది యూదులు ధర్మశాస్తాన్ని అర్థంజేసికొనే రీతిలో మార్పువచ్చింది. వాళు క్రీ.పూ. 587-537 మధ్యలో