పుట:Paul History Book cropped.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆసరాగ తీసుకొని పాపం అతన్ని లొంగదీసికొంది. అతడు గూడ సులువుగానే పాపనికి వశుడైపోయాడు. ఈ శరీరాన్ని జయించే శక్తిని మనకు ప్రసాదించేది పవిత్రాత్మే.

3. ధర్మశాస్త్రం

పాపం నరులను దాసులనుగా ఏలడానికి రెండవ కారణం ధర్మశాస్త్రం. పౌలు ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన అనర్గాన్ని చాల విపులంగా వర్ణించాడు. అతని ప్రధాన అంశాల్లో ఇదికూడ వొకటి. కనుక ధర్మశాస్తాన్ని గూర్చిన అతని భావాలను సంగ్రహంగా పరిశీలిద్దాం.

1. పూర్వవేద భావం

యావే ప్రభువు యిప్రాయేలీయులతో సీనాయి కొండ దగ్గర నిబంధనం చేసికొన్నాడు. దీనితో వాళ్లు అతడు కాచికాపాడే ప్రజలయ్యారు. అతనికి సొంత జనం అయ్యారు. అతడు వాళ్లుకొల్చే దేవుడు అయ్యాడు. ఆ జనాన్ని ఫరో బానిసంనుండి విడిపించాడు కనుక వారిపై అతనికి సర్వాధికారమూ, అన్ని హక్కులూ కలిగాయి. ఈ సందర్భంలోనే ప్రభువు వారికి మోషే ధర్మశాస్తాన్ని ఇచ్చాడు. ప్రజలు ఆ ధర్మశాస్రంలోని ఆజ్ఞలు పాటించాలి. ఈ ధర్మశాస్త్రం ఓవైపు యూవే అధికారాన్ని సూచిస్తుంది. దాన్ని పాటించకపోతే యూవేను ధిక్కరించినట్లే. మరోవైపు అది ప్రజల క్షేమాన్ని గూడ సూచిస్తుంది. దాన్ని పాటిస్తే ప్రజలు క్షేమంగా వుండిపోతారు. అది వాళ్ల మేలు కొరకే ఉద్దేశింపబడింది.


దేవుడు తమ్ము బానిసం నుండి విడిపించాడు కనుక ప్రజలు కృతజ్ఞతాభావంతో, వినయవిధేయతలతో ధర్మశాస్తాన్ని పాటించాలి. దాని ఆజ్ఞలను ప్రేమతో అనుసరించాలి. కనుకనే మోషే మి ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించండి అని ఆజ్ఞాపించాడు -ద్వితీ 6,5.