పుట:Paul History Book cropped.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రోమా 3,9. దీనివల్ల వీళు దేవునికి దూరమై పిశాచానికి దాసులయ్యారు -ఎఫె 2,2. ఫలితంగా దేవుని కోపం వారిపై రగుల్కొంది.

పౌలు పాపాన్ని ఓ వ్యక్తినిగాగూడ భావించాడు. అది ఓ నియంతలాగ నరులను క్రూరంగా ఏలింది. అది నరుల మధ్య వసించింది -రోమా 7,23. నరులను మోసగించి చంపివేసింది. అది ఓ దుష్టశక్తి, దుష్టస్థితి. నరులు తమంతటతాము ఆ దుష్టశక్తినుండి తప్పించుకోలేరు. క్రీస్తే వచ్చి వారిని పాపమనే నియంత దాస్యం నుండి విడిపించాలి.

2. శరీరం

క్రీస్తురాకముందు పాపం నరులను బానిసలుగా ఏలింది అని చెప్పాం. కాని పాపానికి ఆ శక్తి ఏలా వచ్చింది.? "శరీరం" దానికి సహాయపడింది. పౌలు లేఖల్లో శరీరం పారిభాషికపదం. కనుక మనం మొదట ఈ పదం భావాన్ని పరిశీలించాలి.

పాలు లేఖల్లో శరీరం అంటే మన కంటికి కన్పించే నరుడు, లౌకిక మానవుడు, ప్రాకృతిక నరుడు, వరప్రసాదం లేని జనుడు. అతని దృష్టి స్వర్గం వైపుగాక భూమివైపు తిరిగి వుంటుంది. అతడు దుర్బలుడు, క్షణమాత్రజీవి. ఇంకా అతడు దేవునికి వ్యతిరేకి. పాపపు నరుడు. శారీరక మానవుడు, జంతు ప్రవృత్తి కలవాడు. ఆధ్యాత్మిక నరునికి కేవలం భిన్నమైనవాడు. శరీరానుసారంగా జీవించేవాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టలేరు -రోమ 8,8. పౌలు శరీరకార్యాలు 16 పేర్కొన్నాడు. ఇవన్నీ పాపకార్యాలే -గల 5,19-21. శరీరానికి హీబ్రూలో బసార్ అనీ గ్రీకులో సార్క్స్ అనీ పేర్లు. నరుల్లో ఈ శరీరం వల్ల ఏర్పడిన సహజ బలహీనతను లౌకిక వ్యామోహాలనూ