పుట:Paul History Book cropped.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పౌలు భావాల ప్రకారం పిశాచం ప్రేషితులకు ఆటంకాలు, విశ్వాసులకు హింసలు కలిగిస్తుంది. ప్రజల్లో విగ్రహారాధననూ, దేవునివిూద తిరుగుబాటునూ పురికొల్పుతుంది. పౌలు దాన్ని సైతాను, పాము, బేల్యల్ అనే పేర్లతో పిలుస్తుంటాడు. ఇది కొన్నిసార్లు ఏకవ్యక్తి గాను కొన్నిసార్లు బృందంగాను దర్శనమిస్తుంది. చెడ్డను వ్యాపింజేయుడం దానిపని. ఆకాశం, చీకటి దాని నివాసస్థలాలు. పిశాచరాజ్యం దైవరాజ్యానికి వ్యతిరేకమైంది. అది ఈ యుగానికి, ఈ లోకానికి నాయకుడు. ప్రజలను పాపంలో కూలద్రోయడం దానికి ఇష్టం.

తొలి తల్లిదండ్రులనుండి పాపం వచ్చింది. తరతరాల పొడుగున తండ్రులూ తనయులూ అందరూ పాపంలో పడిపోయారు. పౌలు పేర్కొనేది మన వ్యక్తిగతమైన పాపం గాదు, సామూహిక పాపం. వున తండ్రియైన ఆదాము పాపానికి మూలకారణం.

ఒక మనుష్యుని వలన మరణం ప్రవేశించినట్లే పునరుత్థానం కూడా ఒక మనుష్యుని మూలాన్నే వచ్చింది -1కొరి 15,21. ఈ "వొక మనుష్యుడు' ఆదాము. అతడు తెచ్చిపెట్టిన మరణం శారీరకమైందీ, ఆధ్యాత్మికమైందీ కూడ. ఒక మనుష్యుని ద్వారా పాపం ఈ లోకంలోకి ప్రవేశించింది. బైబుల్లో పాపమంటే గురి తప్పడం, గమ్యాన్ని చేరుకోకపోవడం. ఇంకా పాపం దేవునిమిూద తిరుగుబాటు చేయడం గూడ.

అన్యజాతి ప్రజలూ యూదులూ కూడ పాపంలో మునిగిపోయారు. అన్యజాతివారికి దేవుడు తెలుసు. ఐనా వాళ్లు అతన్ని పూజింపక విగ్రహాలను కొల్చారు. సృష్టివస్తువుల్లో చిక్కు కొన్నారు -రోమా 1,21-24. అది వారి తప్ప. ఇక యూదులకు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు తెలుసు. ఐనా వాటిని పాటించనందున పాపం కట్టుకొన్నారు. ఈవిధంగా నరులంతా పాపులైపోయారు -