పుట:Paul History Book cropped.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
6. క్రీస్తు రాకముందు నరుల దౌర్భాగ్యస్థితి

పూర్వాధ్యాయంలో తండ్రి క్రీస్తుద్వారా మనకు సాధించి పెట్టిన రక్షణాన్ని పరిశీలించి చూచాం. అది క్రీస్తు తరపున రక్షణం. ఐతే ఆ రక్షణం మనతరపున ఏలా పనిచేస్తుంది? క్రీస్తురాకముందు నరుల పరిస్థితి ఏలా వుంది? అతడు వచ్చాక ఆ పరిస్థితి ఏలా మారింది? క్రీస్తు రక్షణాన్ని పొందడం వల్ల మనమేలా మారిపోయాం? ప్రస్తుతం ఈ విషయాలను పరిశీలించి చూద్దాం. ఇక్కడ నాలు అంశాలు వున్నాయి. పౌలు దృష్టిలో క్రీస్తురాక ముందు పాపం నరులను ఓనియంతలా ఏలింది. శరీరం వాళ్లను లౌకిక వ్యామోహాల్లో బంధించివుంచింది. ధర్మశాస్రం వాళ్లను బానిసలను చేసింది. వీటన్నిటిఫలితంగా మృత్యువు వాళ్లను కబళించింది. కనుక ఈ నాల్గంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. పాపం

పాలు పాపాన్నిగూర్చి లోతుగా ఆలోచించాడు. క్రీనురాకముందు పాపం లోకమంతటా వ్యాపించి వుంది. జనులంతా ఆ విష వాయువుని పీల్చుకొన్నారు. నరులంతా పాపంచేసి దేవుని మహిమను కోల్పోయారు -రోమా 3.23. ఈ మహిమ నరుల్లో వున్న దేవుని రూపమే. ఈ సందర్భంలో కీర్తనకారుడు "నేను పుట్టినప్పటినుండి పాపత్ముడనే, మాయమ్మ కడుపున పడినప్పటి నుండి కిల్బిషాత్ముడనే" అని చెప్పకొన్నాడు -51,5.

పాపం దేవుని నుండి గాక నరుని నుండే వచ్చింది. దేవుడు నరుణ్ణి అమరుని గాను తనవలె నిత్యునిగాను చేసాడు. కాని పిశాచం అసూయు వలన వుృత్యువు లోకంలోనికి ప్రవేశించింది -సొలోజ్ఞాన2.23-24. G2)