పుట:Paul History Book cropped.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రీస్తు పట్ల విశ్వానం - గల 2,15-16. ఈ విశ్వాసం లేందే పాపపరిహారాన్ని పొందలేం - రోమా 3.25.

2.నరులు రక్షణాన్ని పొందడం

రక్షణానికి హీబ్రూలో "యూషా" అనీ గ్రీకులో "సో తెరియా" అనీ పేరు. క్రీస్తు తన సిలువ మరణంద్వారా మనకు పాపవిముక్తిని కలిగించి రక్షకుడు అయ్యాడు.

పూర్వవేదంలో యూవే యిప్రాయేలుకి దాన్యవిముక్తి కలిగించి రక్షకుడు అయ్యాడు -నిర్గ 14,13. ఇంకా అతడు గిద్యోను, సంసౌను, యెుఫా వెయిదలైన న్యాయూది వతుల ద్వారా యిస్రాయేలును అన్యజనుల నుండి రక్షించాడు. ఈ దృష్టిలో ఈ నాయకులు కూడ రక్షకులే.

పైగా, గ్రీకు రోమను మతాల్లో సేయస్ అపొల్లో, ఆర్టెమిస్, ఎస్ట్కేపియస్ మొదలైన దేవతలను రక్షకులు అని పిల్చేవాళ్లు. వాళ్లు వ్యాధులు, తుఫానులు, కరువుకాటకాలు మొదలైన వాటినుండి తమ భక్తులను రక్షించేవాళ్లు. పౌలుకి ఈసంప్రదాయం తెలుసు. కాలక్రమేణ రక్షణం అంటే నరుడు ఒక దేవతద్వారా ఆపదనుండి తప్పించుకోవడం అనే భావం రూఢమైంది. ఈ యాపదలు శారీరకం, మానసికం, ప్రకృతి వైపరీత్యం, పాపసంబంధం మొదలైనవి ఏవైనా కావచ్చు.

ఇక పౌలు ఈ రక్షణ భావాన్ని క్రీస్తుకి అన్వయించాడు. ఆ ప్రభువు తన సిలువమరణం ద్వారా మనలను రక్షించాడు. క్రీస్తు చిందించిన నెతురు ద్వారా మనకు పాపంనుండి విమోచనం కలిగింది. పౌలు బోధించే సువార్త మనలను పాపంనుండి రక్షిస్తుంది - రోమా 1,16. ఈ రక్షణం ఒక్క యూదులకే గాక క్రీస్తుని విశ్వసించే వాళ్లకు అందరికీ లభిస్తుంది. జ్ఞంలో జీవించే మన రక్షణం