పుట:Paul History Book cropped.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిబంధనను పాటించేవాళ్లను పాపరిహితులనుగా ఎంచుతాడు. ఈ సందర్భంలో ఒకానొక కుమ్రాను భక్తుని ప్రార్ధన యిది. "నేను దుర్మారుల వర్గానికి చెందినవాణ్ణి

నా పాపాలవల్లనే నేను పురుగులకు మేత అయ్యాను చీకటిలో నడచాను

ఏ నరుడూ స్వయంగా నీతిమార్గాన నడవలేడు

దేవుడే అతన్ని ధర్మమార్గాన నడిపించాలి

నేను బలహీనతవల్ల పాపంలో పడిపోతే

నీతిమంతుడైన దేవుడే నన్ను నిర్మలుణ్ణి చేయాలి".

ఇక, పౌలు ఈ నీతి అనే భావాన్ని క్రైస్తవులకు వర్తింపజేసాడు. డమస్కు దర్శనం అతనికి వెలుగును ప్రసాదించింది. దానివల్ల అతడు నరులంతా పాపులనీ క్రీస్తు వారి పాపాలను తొలగించి వారిని నీతిమంతులను చేస్తాడనీ గ్రహించాడు. నరుడు నీతిమంతుడు అయ్యాడు అంటే దేవుడు అతడు నిర్దోషి అని తీర్పు చెప్పాడు అని భావం. క్రీస్తు మరణోత్థానాలు అతని పాపాన్ని పరిహరించాయి. అతని పాపాలు తొలగిపోయింది ధర్మశాస్తాన్ని పాటించడం వల్ల కాదు, క్రీస్తు మరణోత్థానాల వల్ల. తండ్రి క్రీస్తురక్షణం మనకు వర్తించేలా చేసాడు. అతడు క్రీసుని మన పాపాల కొరకు మరణానికి అప్పగించాడు. మనలను నీతిమంతులను చేయడానికి అతన్ని మరల లేపాడు-రోమా 4,25. క్రీస్తుని విశ్వసించినవారిని తండ్రి నీతిమంతులను జేసి తన కుమారులనుగా గణించాడు - గల 3,26. మనంతట మనం నీతిమంతులం కాలేము. దేవుడే క్రీస్తుద్వారా మనలను పాపరహితులను చేయాలి. అది మనకు ఉచితంగా లభించే భాగ్యం -రోమా 10,3. ఆ భాగ్యం మన కృషివల్లగాక దేవుని మంచితనం వల్లనే లభిస్తుంది. మన తరపున మనకు కావలసింది